Suriya, Karthi: ఖైదీ సీక్వెల్ లో పోటీ పడనున్న కోలీవుడ్ బ్రదర్స్?

ప్రస్తుత కాలంలో మల్టీస్టారర్ చిత్రాల హవా కొనసాగుతోంది.ఈ క్రమంలోనే ఎంతోమంది స్టార్ సెలబ్రెటీలు మల్టీస్టారర్ చిత్రాల్లో నటించడానికి ఆత్రుత కనబరుస్తున్నారు. ప్రేక్షకులు సైతం ఇలా ఇద్దరు స్టార్ హీరోలను ఒకే తెరపై చూడాలని ఎంతో ఆతృత కనబరుస్తున్నారు. ఇప్పటికే త్రిబుల్ ఆర్ వంటి సినిమాతో ఎంతో మంచి విజయాన్ని అందుకున్న రామ్ చరణ్ ఎన్టీఆర్ బాటలోనే మరికొంత మంది హీరోలు మల్టీస్టారర్ చిత్రాలు చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ఇకపోతే కోలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రనటులుగా కొనసాగుతున్నటువంటి సూర్య,

తమ్ముడు కార్తీ ఇద్దరు కూడా ఒకే తెరపై సందడి చేస్తే చూడాలని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ప్రేక్షకుల కల ఖైదీ సినిమా సీక్వెల్ చిత్రం ద్వారా తీరబోతోందని తెలుస్తోంది. ఖైదీ సినిమా ద్వారా కార్తీక్ ఎంతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమా సీక్వెల్ చిత్రాన్ని చేయాలని భావించినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ విషయాన్ని దర్శకుడు లోకేష్ కనగరాజ్ విక్రమ్ సినిమా క్లైమాక్స్ లో ఖైదీ2 కి సంబంధించి అధికారికంగా వెల్లడించారు.

అయితే ఈ సినిమా సీక్వెల్ లో కార్తితో పాటు సూర్య కూడా సందడి చేయనున్నారు. ఇక ఈ సినిమాలో కార్తీ హీరో పాత్రలో నటించగా,సూర్య విలన్ పాత్ర ద్వారా ప్రేక్షకులను సందడి చేయనున్నట్లు దర్శకుడు హింట్ ఇచ్చారు. ఈ సీక్వెల్ సినిమా ద్వారా అన్నదమ్ముల మధ్య గట్టిపోటీ ఏర్పడనునట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమాలో యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ గెస్ట్ పాత్రలో సందడి చేయనున్నట్లు సమాచారం.

ఖైదీ సినిమాను నిర్మించిన ఎస్.ఆర్.ప్రభు ఈ సీక్వెల్ ను కూడా నిర్మించనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇలా వెండితెరపై సూర్య, కార్తీ ఇద్దరు సందడి చేయనున్నారని తెలియడంతో ఇప్పుడే ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడి ఈ సినిమా పక్కా హిట్ అంటూ వీరి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus