తమిళ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చే సినిమాలు తెలుగులో కూడా ఎప్పటికప్పుడు విడుదలవుతుంటాయి. రజినీకాంత్ (Rajinikanth), సూర్య (Suriya) , విజయ్ (Vijay Thalapathy) లాంటి తమిళ స్టార్ హీరోలకు టాలీవుడ్‌లో ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. వారి సినిమాలు వస్తున్నాయంటే తెలుగు ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తారు. కానీ, ఇటీవల కాలంలో తమిళ సినిమాలు తెలుగు ప్రేక్షకులను మెప్పించలేకపోతున్నాయి. తమిళంలో సూపర్ హిట్‌గా నిలిచిన చిత్రాలు ఇక్కడ మాత్రం ఫ్లాప్‌గా మిగులుతున్నాయి. ఈ ధోరణి తమిళ, తెలుగు ఆడియన్స్ అభిరుచుల్లో తేడాను స్పష్టంగా చూపిస్తోంది.
గత నెలలో అజిత్ (Ajith) నటించిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ (Good Bad Ugly) తమిళంలో భారీ వసూళ్లు సాధించి, రికార్డులు క్రియేట్ చేసింది. కానీ, తెలుగులో సాధారణ చిత్రంగా మిగిలిపోయింది. ఇప్పుడు సూర్య ‘రెట్రో’ (Retro) సినిమా కూడా ఇదే బాట పట్టింది. కార్తీక్ సుబ్బరాజ్ (Karthik Subbaraj) దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంపై తెలుగు ఆడియన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ, సినిమా వారి అంచనాలను అందుకోలేకపోయింది. రెండో రోజు నుంచే తెలుగులో పేలవ వసూళ్లు సాధించి, ఫ్లాప్‌గా నిలిచింది.
అదే తమిళంలో ‘రెట్రో’ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. వీకెండ్‌లో థియేటర్లు హౌస్‌ఫుల్‌తో మంచి కలెక్షన్లు రాబట్టింది. తమిళంలో రొటీన్ మాస్ మసాలా సినిమాలు కూడా ఆడియన్స్‌ను ఆకర్షిస్తున్నాయి, కానీ తెలుగులో అవే సినిమాలు నిరాశపరుస్తున్నాయి. ఈ తేడా ఆడియన్స్ అభిరుచుల్లోని వైవిధ్యాన్ని చూపిస్తోంది. తమిళ ఆడియన్స్ ఎమోషనల్ డ్రామా, మాస్ ఎలిమెంట్స్‌ను ఇష్టపడితే, తెలుగు ప్రేక్షకులు కథలో డెప్త్, కొత్తదనం కోరుకుంటున్నారు. ‘రెట్రో’, ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’లు (Good Bad Ugly) తమిళంలో హిట్ అయినా, తెలుగులో ఫ్లాప్ కావడం ఈ విషయాన్ని మరింత స్పష్టం చేస్తోంది.