Kanguva: సూర్య ‘కంగువా’… ఊహించని సంచలనం..!

సూర్య (Suriya) హీరోగా ‘సిరుతై’ శివ (Siva) దర్శకత్వంలో ‘కంగువా’ (Kanguva) అనే పాన్ ఇండియా సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. నవంబర్ 14 న రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి షోతోనే డిజాస్టర్ టాక్ ను మూటగట్టుకుంది. ఓపెనింగ్స్ కొంతవరకు ఓకే అనిపించినా.. ఫైనల్ గా భారీ నష్టాలు మిగిల్చింది ఈ సినిమా. కంటెంట్ పరంగా కూడా క్రిటిక్స్ ను కూడా మెప్పించలేదు. ఇలాంటి సినిమా ఆస్కార్ బరిలో నిలవడం అనే మాట అందరికీ షాకిస్తుంది.

Kanguva

అవును మరో 2 నెలల్లో 97వ అకాడమీ అవార్డ్స్ ఈవెంట్‌ జరగబోతోంది. ‘అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్’… ఈ ఏడాది ఆస్కార్‌కు అర్హత సాధించిన 323 చలన చిత్రాల లిస్టుని వెల్లడించడం జరిగిండ్. ఈ లిస్టులో 207 చిత్రాలు ఉత్తమ చిత్రం కేటగిరిలో పోటీ పడనున్నాయి. ఇందులో 6 ఇండియన్ సినిమాలు ఉండటం విశేషంగా చెప్పుకోవాలి.తమిళం నుండి ‘కంగువా’, మలయాళం నుండి ‘ది గోట్ లైఫ్’ (The Goat Life) ‘ఆల్ వి ఇమాజిన్ ఆజ్ లైట్‌’ ,బాలీవుడ్ నుండి ‘సంతోష్’ ‘స్వాతంత్య్ర వీర్ సావర్కర్’, ‘గ‌ర్ల్స్ విల్ బి గ‌ర్ల్స్’ (హిందీ-ఇంగ్లిష్) చిత్రాలు ఆస్కార్ బరిలో నిలిచిన ఇండియన్ సినిమాలు.

ఇందులో ‘కంగువా’ ఏ రకంగా స్థానం సంపాదించింది? ఎలా దీనిని ఎంపిక చేసుకున్నారు? అనేది ఎవ్వరికీ అర్ధం కావడం లేదు. జనవరి 8 నుండి ఓటింగ్ ప్రారంభం అవుతుంది. జనవరి 12తో అది ముగుస్తుంది. జనవరి 17న వీటిలో ఫైనల్ అయిన సినిమాలు ఏంటో తెలుస్తాయి. ఆస్కార్ 2025 వేడుక ఈ ఏడాది మార్చి 2న ఓవేషన్ హాలీవుడ్‌లోని డాల్బీ థియేటర్‌లో జరగబోతున్న సంగతి తెలిసిందే.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus