Kanguva: యాక్షన్ సినిమా రిలీజ్ కి ఆ డేట్ ను ఎలా డిసైడ్ అయ్యారు?

వరుస పరాజయాలతో కొట్టుమిట్టాడుతున్న సూర్యకి (Suriya)  ఓటీటీలో విడుదలైన “ఆకాశమే నీ హద్దురా, జై భీమ్” మంచి ఉత్సాహాన్నిచ్చాయి. ఆ ఊపులోనే శివ (Siva)  దర్శకత్వంలో ఓ భారీ యాక్షన్ సినిమాకి ఓకే చెప్పాడు సూర్య.. అదే “కంగువ” (Kanguva). తమిళంలో కంగువ అంటే నిప్పులాంటి మనిషి అని అర్థం. తెలుగులో ఈ పదానికి సరైన అర్థం లేదు అయినా కూడా చిత్రబృందం కనీసం తెలుగు వెర్షన్ కు టైటిల్ మార్చకుండా అదే టైటిల్ తో విడుదల చేయడానికి సిద్ధమయ్యారు.

Kanguva:

నిజానికి అక్టోబర్ 10న సినిమాను విడుదల చేయడానికి సన్నద్ధమైనప్పటివి.. అదే సమయానికి రజనీకాంత్  (Rajinikanth)  “వెట్టయాన్” (Vettaiyan)  కూడా విడుదలకు సిద్ధమవ్వడం, “కంగువ” పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తవ్వకపోవడంతో సినిమాను పోస్ట్ పోన్ చేసుకున్నారు. అయితే.. ఇవాళ ఉదయం “కంగువ” చిత్రాన్ని నవంబర్ 14న విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది బృందం. నవంబర్ 14 బాలల దినోత్సవం అని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఈ వైల్డ్ యాక్షన్ సినిమాను ఆ తేదీకి విడుదల చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది చిత్ర బృందానికే తెలియాలి.

తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలవుతున్న ఈ చిత్రంపై మంచి అంచనాలున్నాయి. మరి సినిమా ఆ అంచనాలను అందుకోగలుగుతుందో లేదో తెలియాలంటే నవంబర్ 14 వరకు వెయిట్ చేయాల్సిందే. ఇకపోతే.. బాబీ డియోల్ (Bobby Deol) ప్రతినాయకుడిగా నటించిన ఈ చిత్రంలో దిశా పాట్నీ హీరోయిన్.

కానీ ఇప్పటివరకు సినిమాకి సంబంధించిన ఎటువంటి వీడియో ప్రమోషనల్ కంటెంట్ లోనూ ఆమె కనిపించకపోవడం గమనార్హం. మరి ఆమె క్యారెక్టర్ & గెటప్ రివీల్ అయితే సినిమాకి సంబంధించిన కీలకమైన విషయాలు ఏమైనా తెలిసిపోతాయని బృందం భావిస్తున్నారో ఏమో తెలియదు కానీ.. కనీసం విడుదలకు ముందైనా దిశా పఠానీ (Disha Patani)  గ్లామర్ ను వినియోగించుకోకపోతే కష్టమే!

సైలెంట్..గా ప్రభాస్ సినిమా షూటింగ్ మొదలు.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus