Kanguva: ‘కంగువ’పై నిర్మాతలకు అంత నమ్మకమా? అన్ని చోట్ల రిలీజ్‌ ఎందుకో?

కొన్ని సినిమాల గురించి వింటుంటే బ్లాక్‌బస్టర్‌ వైబ్‌ ఆటోమేటిగ్గా వచ్చేస్తుంటుంది. ఎలా చేస్తున్నారు, ఏంటి ప్రత్యేకతలు లాంటి వివరాలు బయటకు పూర్తిగా రాకపోయినా వచ్చిన ఆ చిన్న వివరాలే చాలా ఎక్కువ అనిపిస్తుంటాయి. అలాంటి సినిమాల గురించి నెవర్‌ బిఫోర్‌ న్యూస్‌లు వింటుంటే ఆ హైప్‌ అమాంతం పెరిగిపోతుంది. అలాంటి సినిమా ఒకటి ఇప్పుడు కోలీవుడ్‌లో తెరకెక్కుతోంది. అదే ‘కంగువ’. సూర్య హీరోగా రూపొందుతున్న ఈ సినిమా గురించి ఆసక్తికర విషయం బయటకు వచ్చింది.

‘కంగువ’ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో కాకుండా పాన్ వరల్డ్ రేంజిలో రిలీజ్ చేస్తున్నారట. ఆ లెక్కన అత్యధిక భాషల్లో విడుదల కాబోతున్న మొదటి ఇండియన్‌ మూవీ ఇదే అవుతుంది అని చెబుతున్నారు. తమిళ మాస్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో సూర్య హీరోగా నటిస్తున్న ‘కంగువ’ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది. ఆ భారీతనాన్ని మరింత పెంచేలా సినిమాను సుమారు 38 భాషల్లో విడుదల చేస్తారట.

పీరియాడికల్ బ్యాక్ డ్రాప్‌లో రూపొందుతున్న (Kanguva) ‘కంగువ’ సినిమా టీజర్ ఇప్పటికే విడుదలై భారీ రెస్పాన్స్ అందుకుంది. సినిమాలో సూర్య మేకోవర్, గెటప్ ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకుంటున్నాయి. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా గురించి నిర్మాత జ్ఞానవేల్ రాజా ఇటీవల కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు అవే సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అందులో భాగంగానే ఈ 38 భాషల సంగతి బయటికొచ్చింది. తమిళ చిత్ర పరిశ్రమ స్థాయిని మరింత పెంచేలా ‘కంగువ’ సినిమా ఉండబోతోదట.

అంత ప్రతిష్ఠాత్మ సినిమాను ఐమ్యాక్స్, త్రీడీ వెర్షన్‌లో అందుబాటులోకి తీసుకొస్తారట. ఇక ఈ సినిమాలో సూర్య ఆరు విభిన్న అవతారాల్లో కనిపిస్తాడని టాక్‌. అందులో ఓ పాత్రలో నెగిటివ్ షేడ్స్‌లో ఉంటుందట. దిశా పటాని హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. వచ్చే ఏడాది వేసవి కానుకగా సినిమా విడుదల చేస్తారట. అన్నట్లు ఈ సినిమా మూడు భాగాలుగా రాబోతోందట. అయితే పార్ట్‌ 1 ఫలితం మీదే మిగిలిన రెండు పార్టులు ఉండొచ్చట.

మంగళవారం సినిమా రివ్యూ & రేటింగ్!

స్పార్క్ సినిమా రివ్యూ & రేటింగ్!
సప్త సాగరాలు దాటి సైడ్ బి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus