దర్శకుడిగా కంటే నయనతార ప్రియుడిగానే ఎక్కువగా వార్తల్లో నిలిచాడు విఘ్నేశ్ శివన్. ‘నానుమ్ రౌడీదాన్’ సినిమా సమయంలో చిగురులు తొడిగిన వీరి ప్రేమాయణంతో నయన్ నిర్మాతగాను మారుతుందన్న ప్రచారం జరిగింది. తర్వాత అది పుకారని తేలిపోయినా సూర్య సినిమాతో మరోసారి చిచ్చు రాజుకుంది. తాజాగా దీనికి మరో విషయం బలం చేకూరుస్తోంది.
చెన్నై వర్గాల సమాచారం ప్రకారం విఘ్నేశ్ శివన్ తెరకెక్కించనున్న సినిమాలో నయన్ హీరోయిన్ గా నటిస్తోందట. సూర్యకి జోడీగా నయన్ కిది నాలుగో చిత్రం. గతంలో వీరిద్దరూ గజినీ, మాస్ (తెలుగులో రాక్షసుడు), ఆధవన్ (ఘటికుడు) సినిమాల్లో జంటగా నటించారు. ప్రముఖ దర్శకుడు కె.ఎస్.రవికుమార్, శరణ్య సూర్య తల్లిదండ్రులుగా కనపడనున్నారు. హీరోయిన్ పాత్రకు నయనతార సరిపోతుందని చిత్ర వర్గాలు చెబుతున్నా లోలోపల మాత్రం ఇదంతా లవ్ మ్యాజిక్ అని గుసగుసలాడుకుంటున్నారు.