సెప్టెంబర్ 20న ‘సింగం 3’ టీజర్

దక్షిణాదిన మూడు భాగాలుగా రూపొందిన తొలి చిత్రంగా ‘సింగం’ సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఈ సిరీస్ లోని గత రెండు సినిమాలు విజయవంతం కాగా మూడో సినిమా ప్రస్తుతం ముస్తాబవుతోంది. ఈ సిరీస్ లో గత రెండు చిత్రాలకు దర్శకత్వం వహించిన హరి ఈ సినిమాకి మెరుగులు దిద్దుతుండగా, సూర్య-అనుష్క హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. శృతి హాసన్ మరో కీలక పాత్రలో కనపడనున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల తేదీ ఖరారయ్యింది.

సెప్టెంబర్ 20న ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ విడుదల చేసేందుకు చిత్ర బృందం నిర్ణయించుకుందట. సినిమా కథ ఆంధ్రలోనే జరుగుతుందని చెన్నై చిత్రవర్గాలు చెబుతున్నాయి. అందుకనే ఈ చిత్రంలో పలు కీలక సన్నివేశాలు నెల్లూరు, విశాఖపట్నంలో చిత్రీకరించారు. గత చిత్రాల లానే ఈ సినిమా సైతం ప్రేక్షకులని మెప్పిస్తుందని చిత్ర యూనిట్ నమ్మకంగా ఉన్నారు. జ్ఞానవేల్ రాజా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి హ్యారిస్ జైరాజ్ సంగీత దర్శకుడు. ‘ఎస్3’ (సింగం 3) ఆడియోను ఈ నెలాఖరున లేదా అక్టోబర్ తొలి వారంలో విడుదల చేసి సినిమాని దీపావళికి రిలీజ్ చేయాలన్నది దర్శక నిర్మాతల ప్లాన్.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus