Pushpa 2: ‘పుష్ప 2’ కోసం మరోసారి ‘పుష్ప’ స్టైల్‌ ప్లాన్‌!

‘పుష్ప’ సినిమాలో హైలైట్‌ సీన్స్‌ ఏంటి? అంటే చాలానే చెప్పొచ్చు. అయితే సినిమా విడుదలకు ముందు ఏ అంశం ఎక్కువగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది అంటే.. కొన్ని పాత్రలకు నటుల ఎంపిక. విలన్ల నుండి చిన్న చిన్న పాత్రల వరకు అందరి ఎంపికకు మంచి మార్కులే పడ్డాయి. ఆఖరికి ఐటెమ్‌ సాంగ్‌ కోసం సమంతను ఎంపిక చేయడం ఎంతటి ఆశ్చర్యాన్నికలిగించిందో కూడా మీకు తెలిసే ఉంటుంది. ఇప్పుడు ‘పుష్ప 2’ విషయంలోనూ అలాంటి ప్రయత్నమే చేయబోతున్నారు అని సమాచారం.

‘పుష్ప: ది రైజ్‌’ తరహాలోనే ‘పుష్ప: ది రూల్‌’లోనూ ఐటెమ్‌ సాంగ్‌ ఉంటుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తొలి సినిమాలో ఐటెమ్‌ భామగా సమంత అదరగొట్టింది. ‘ఉ అంటావా ఊఊ అంటావా..’ అంటూ సమంత హోయలకు కుర్రకారు కిర్రెక్కిపోయారు. ఇప్పుడు రెండో పార్టులో అంతకుమించిన పాట, అంతకుమించిన అందం ఉండాలి. ప్రస్తుతం చిత్రబృందం ఈ పనిలోనే బిజీగా ఉందట. ఐటెమ్‌ సాంగ్‌ అద్భుతమైనది కుదరడం ఎంత కష్టమో, దానికి తగ్గ హీరోయిన్‌ అందులోనూ స్టార్‌ హీరోయిన్‌ దొరకడం ఇంకా కష్టం.

మరి మైత్రీ మూవీమేకర్స్‌ – సుకుమార్‌ టీమ్స్‌ ఏం చేస్తాయో చూడాలి. రెండో ‘పుష్ప’లో ఐటెమ్‌ సాంగ్‌ కోసం కాజల్‌ను సంప్రదించారట కొన్ని వార్తలు గత రెండు రోజులుగా చక్కర్లు కొట్టాయి. అలాగే మరికొంతమంది నాయికల పేర్లు కూడా వినిపించాయి. ‘పుష్ప: ది రైజ్‌’ విషయంలో జరిగినట్లే.. ఇప్పుడు కూడా ఎవరూ ఊహించని హీరోయిన్‌నే తీసుకుంటారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దానికి తోడు గతంలో ఐటెమ్‌ సాంగ్‌ చేయని హీరోయిన్‌ అయితే బెటర్‌ అని కూడా అనుకుంటున్నారు.

ప్రస్తుతం టాలీవుడ్‌లో ఐటెమ్‌ సాంగ్‌ చేయని స్టార్‌ హీరోయిన్ల సంఖ్య బాగా తక్కువ. కాబట్టి సినిమా షూటింగ్‌ క్లైమాక్స్‌కి వచ్చేసరికి ఐటమ్‌ భామ కోసం కుర్ర స్టార్‌ హీరోయిన్‌ను తీసుకుంటారు అని టాక్‌ నడుస్తోంది. ఒకవేళ మరీ లేదంటే బాలీవుడ్‌ నుండి స్టార్‌ హీరోయిన్‌ను తీసుకొచ్చి సినిమాకు హైప్‌ ఇంకా పెంచాలని అనుకుంటున్నారట.

కృష్ణ వృంద విహారి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అల్లూరి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఇనయ సుల్తానా గురించి ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్6’ కంటెస్టెంట్ అభినయ శ్రీ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus