దిల్‌ రాజు కొత్త సినిమాపై ఇంట్రెస్టింగ్‌ రూమర్‌

ప్రభాస్‌ హీరోగా… దిల్‌ రాజు ఓ సినిమా చేస్తాడని చాలా రోజుల క్రితం ఓ రూమర్‌ వచ్చింది. ఆ సినిమాకు దర్శకుడు బోయపాటి శ్రీను అని కూడా వార్తలొచ్చాయి గుర్తుందా? అవును ఇప్పుడెందుకు ఆ విషయం… ఆ సినిమా మెటీరియలైజ్‌ అవ్వలేదని కూడా వార్తలొచ్చాయి అంటారా? అయితే ఇక్కడే విషయం ఉంది. ఇటీవల దిల్‌ రాజు నిర్మాణంలో సూర్య హీరోగా ఓ సినిమా వస్తుందని వార్తలొచ్చాయి కదా. ఆ సినిమా ఇదే అనేది తాజా వార్త. ఈ సినిమాకు బోయపాటి దర్శకుడనే విషయం మీకు తెలిసిందే.

సూర్యను హీరోగా పెట్టి తెలుగు, తమిళ భాషల్లో సినిమా వస్తే బాగుండు అని చాలా రోజుల నుంచి అభిమానులు ఆశిస్తున్నారు. సూర్య కూడా స్ట్రయిట్‌ తెలుగు సినిమా చేయడానికి ఎదురు చూస్తున్నాడు. అయితే సరైన కథ, కాంబో దొరకలేదు. కానీ ఇప్పుడు కుదిరేలా కనిపిస్తోంది. బోయపాటి డైరక్షన్‌ సూర్య స్ట్రయిట్‌ తెలుగు కోరిక నెరవేరబోతోందట. దిల్‌ రాజు ఈ సినిమాను నిర్మిస్తారని అంటున్నారు. గతంలో ప్రభాస్‌కు చెప్పిన కథనే సూర్యకి చెప్పి బోయపాటి ఓకే చేయించుకున్నాడట.

ప్రభాస్‌తో సినిమా కోసం బోయపాటి ఈ కథను చెప్పాడు. అయితే ఆ తర్వాత ప్రభాస్‌ ఈ సినిమా ఇంట్రెస్ట్‌ చూపించలేదు. ఆ తర్వాత ప్రభాస్‌ పాన్‌ ఇండియా సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు. దీంతో ఆ సినిమా అలా ఆగిపోయింది. ఇప్పుడు సూర్య చేస్తున్నాడట. ప్రస్తుతం బోయపాటి.. బాలయ్య సినిమా పనిలో ఉన్నాడు. ఆ తర్వాత సూర్య సినిమా ఉంఉందట. ప్రస్తుతం చివరి దశ చర్చల్లో ఈ సినిమా గురించి త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని సమాచారం.

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus