సుశాంత్ నిజంగానే గొప్ప మనసున్న మనిషే..!

ప్రముఖ బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆదివారం నాడు ముంబైలోని బాంద్రాలో ఉన్న తన నివాసంలో ఆత్మహత్య చేసుకుని చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ విషయం తెలిసినప్పటి నుండీ బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా విషాద ఛాయలు అల్లుకున్నాయి. అతను ఎందుకు సూసైడ్ చేసుకున్నాడు అనే వార్తలు సోషల్ మీడియాలో డిస్కషన్లు జరుగుతున్నాయి.ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ వచ్చిన సుశాంత్ కు సంబంధించి ఓ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.

అదేంటంటే… 2018 లో కేరళలో భారీ వరదలు సంభవించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వేలాది మంది ఇళ్ళు కోల్పోయి నిరాశ్రయులు కూడా అయ్యారు. ఆ సమయంలో వారు సహాయం చేసే వారికోసం ఎదురుచూస్తున్న తరుణంలో సుశాంత్ అభిమాని.. ఒకరు వారిని ఆదుకోవలసిందిగా అతడిని కోరాడు. దాంతో వెంటనే స్పందించిన సుశాంత్ .. ఆ అభిమాని పేరుతో సీఎం రిలీఫ్ ఫండ్ కి కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించాడు. ఎంత సెలబ్రిటీలు అయినా లక్షల్లో విరాళాలు అందిస్తారు కానీ..

అంత పెద్ద మొత్తం ఇవ్వడానికి సాహసించరు. అలాంటిది సరిగ్గా 12 సినిమాలు మాత్రమే చేసిన సుశాంత్.. పెద్ద మొత్తంలో సంపాదించే అవకాశం ఉండదు. అయినప్పటికీ అతను కోటి రూపాయలు అందచేయడం.. అంటే ‘గొప్ప మనసున్న వాడని’ నెటిజన్లు అతన్ని ప్రశంసిస్తున్నారు. అలాంటి మంచి మనిషి, గొప్ప మనిషి.. ఈరోజున లేకపోవడం అందరి దురదృష్టకరమే అని.. అతన్ని గుర్తుచేసుకుని బాధపడుతున్నారు నెటిజన్లు.

1

2

Most Recommended Video

కవల పిల్లలు పిల్లలు కన్న సెలెబ్రిటీలు వీరే..!
బాగా ఫేమస్ అయిన ఈ స్టార్స్ బంధువులు కూడా స్టార్సే
బాలయ్య సాధించిన అరుదైన రికార్డ్స్ ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus