Sushanth: చిరు, బన్నీ ల గురించి సుశాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు!

‘భోళా శంకర్’ సినిమా ఆగస్టు 11న విడుదల కాబోతుంది.మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఈ చిత్రానికి మెహర్ రమేష్ దర్శకత్వం వహించాడు. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘వేదాలం’ చిత్రానికి ఇది రీమేక్. ఒరిజినల్ తో పోలిస్తే తెలుగులో చాలా మార్పులు చేశారు. ఇక్కడ చెల్లి పాత్రకి బాయ్ ఫ్రెండ్ ట్రాక్ ను పెంచారు. చిరుకి చెల్లిగా కీర్తి సురేష్ నటించింది. ఆమెకు బాయ్ ఫ్రెండ్ గా అక్కినేని హీరో సుశాంత్ నటించాడు.

గతంలో అల్లు అర్జున్ తో కలిసి ‘అల వైకుంఠపురములో’ చిత్రంలో కూడా నటించాడు సుశాంత్. ఇక ‘భోళా శంకర్’ ప్రమోషన్లో భాగంగా సుశాంత్ పాల్గొని.. ఈ సినిమా గురించి అలాగే చిరంజీవి, బన్నీ ల గురించి ఆసక్తికర కామెంట్లు చేశాడు. సుశాంత్ మాట్లాడుతూ.. “చిన్నప్పటి నుండి చిరంజీవి గారి డ్యాన్స్ అంటే నాకు పిచ్చి. చిన్నప్పుడు ఆయన సాంగ్ షూటింగ్ కి 2 , 3 సార్లు వెళ్ళాను.

మెగాస్టార్ తో స్క్రీన్ పంచుకోవడమే నాకు ఓ అదృష్టం అనుకుంటే ఈ సినిమాలో ఏకంగా ఆయనతో కలిసి డాన్స్ చేసే అవకాశం కూడా దక్కింది. ఇది నా జీవితంలో ఓ మంచి మెమరీ. ‘అల వైకుంఠపురంలో’ బన్నీతో కూడా కలిసి డాన్స్ చేశాను. కానీ చిరంజీవి గారు చిరంజీవి గారే. బన్నీ మంచి డ్యాన్సరే..! కానీ చిరంజీవి గారితో బన్నీని పోల్చలేం. బన్నీకి కూడా చిరంజీవి గారే ఆదర్శం” అంటూ చెప్పుకొచ్చాడు (Sushanth) సుశాంత్.

ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ ‘బలగం’ తో పాటు చావు కాన్సెప్ట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్..
హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus