Sushanth: బ్రేకప్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన సుశాంత్!

ఈ మధ్య కాలంలో టాలీవుడ్ లో కొన్ని జంటలు విడిపోతూ వార్తల్లో నిలుస్తుండటం గమనార్హం. ఈ జంటలలో కొన్ని జంటలు ప్రేమలో ఉన్న సమయంలో విడిపోతుంటే మరికొన్ని జంటలు మాత్రం పెళ్లి తర్వాత కొన్నేళ్లు అన్యోన్యంగా ఉండి విడిపోతున్నారు. సెలబ్రిటీల విడాకులకు సంబంధించి సోషల్ మీడియా వేదికగా జోరుగా చర్చ జరుగుతోంది. విడాకుల విషయంలో కొంతమంది అబ్బాయిలది తప్పని చెబితే మరి కొందరు అమ్మాయిలది తప్పని చెబుతున్నారు. అయితే సుమంత్ హీరోగా తెరకెక్కిన మళ్లీ మొదలైంది మూవీ ఈ నెల 11వ తేదీన ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న సంగతి తెలిసిందే.

Click Here To Watch

తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా ఈ ఈవెంట్ లో సుశాంత్, నిఖిల్ బ్రేకప్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ మధ్యే పెళ్లి చేసుకున్న నిఖిల్ బ్రేకప్ పై తన అభిప్రాయం ఏమిటని అడుగుతున్నారని ఇంట్లో కూర్చుని నా వైఫ్ టీవీ చూస్తుంది కాబట్టి ఈ ప్రశ్నకు నేను సమాధానం చెప్పనని నిఖిల్ అన్నారు. మొన్నే నాకు పెళ్లైందని అప్పుడే బ్రేకప్ అంటే కష్టమని నిఖిల్ కామెంట్లు చేశారు.

ప్రస్తుతం వైవాహిక జీవితం విషయంలో చాలా సంతోషంగా ఉన్నానని తనకు బ్రేకప్ లాంటి ఆలోచనలు కూడా అస్సలు లేవని నిఖిల్ చెప్పుకొచ్చారు. మరో హీరో సుశాంత్ బ్రేకప్ గురించి స్పందించడానికి తాను సరైన వ్యక్తిని కాదని వెల్లడించారు. నాకు ఇంకా పెళ్లి కాలేదని కాలేజ్ సమయం నుంచి బ్రేకప్స్ ఉంటాయని సుశాంత్ అన్నారు. బ్రేకప్స్ జరిగితే మనిషి బెటర్ అవుతాడని సుశాంత్ కామెంట్లు చేశారు. తన లైఫ్ లో కూడా చిన్నచిన్న బ్రేకప్స్ ఉన్నాయని పెళ్లి తర్వాత బ్రేకప్స్ గురించి తాను ఇప్పుడే మాట్లాడలేనని సుశాంత్ చెప్పుకొచ్చారు.

నిఖిల్, సుశాంత్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సెలబ్రిటీ జోడీలు విడిపోతున్న నేపథ్యంలో ఆ ప్రభావం సాధారణ జోడీలపై పడే ఛాన్స్ ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus