Sushmita Konidela : రీమేక్ కథతో సుష్మితా ప్లాన్!

మెగాస్టార్ చిరంజీకి పెద్ద కూతురు సుష్మితా కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేస్తోన్న సంగతి తెలిసిందే. చిరంజీవితో పాటు రామ్ చరణ్ సినిమాలు కొన్నింటికి ఆమె పని చేసింది. గత ఏడాదిలో ఆమె నిర్మాతగా కూడా మారింది. గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ పేరుతో బ్యానర్ ను స్థాపించి తన భర్త విష్ణుతో కలిసి ఓ వెబ్ సిరీస్ కూడా నిర్మించింది. ‘షూటౌట్ ఎట్ ఆలేరు’ పేరుతో తెరకెక్కిన ఆ సిరీస్ కు ఓ మోస్తరు రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు సుష్మితా సినిమా నిర్మాణానికి కూడా రెడీ అవుతున్నట్లు సమాచారం. రీసెంట్ గా ఈమె ఓ తమిళ సినిమా రీమేక్ హక్కులను తీసుకున్నట్లు తెలుస్తోంది.

‘8 తొట్ట‌క‌ల్’ అనే సినిమా తమిళంలో నాలుగేళ్ల క్రితం విడుదలైన మంచి సక్సెస్ అందుకుంది. వెట్రి అనే కొత్త హీరో ఇందులో నటించాడు. ‘ఆకాశం నీ హద్దురా’ ఫేమ్ అపర్ణ బాలమురళి ఈ సినిమాలో నటించింది. శ్రీ గణేష్ అనే దర్శకుడు రూపొందించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఓ జపనీస్ సినిమా స్పూర్తితో ఈ సినిమాను రూపొందించారు. ఇందులో హీరో పోలీస్. ఓ నేరస్థుడ్ని పట్టుకునే క్రమంలో అతడు తన రివాల్వర్ పోగొట్టుకుంటాడు. దాన్ని దొంగిలించిన వ్యక్తి మరొకరికి దానిని అమ్ముతాడు.

ఆ తరువాత ఏం జరిగిందనే అంశాలను చాలా ఉత్కంఠభరితంగా రూపొందించారు. ఈ సినిమాను కన్నడలో రీమేక్ చేయగా.. అక్కడ కూడా సినిమా పెద్ద హిట్ అయింది. ఇప్పుడు సుష్మితా ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి రెడీ అవుతుంది. ఓ యంగ్ హీరోతో సినిమా చేయబోతుంది. అయితే మెగా ఫ్యామిలీలో చాలా మంది యంగ్ హీరోలు ఉన్నారు కాబట్టి వారిలో ఒకరిని సెలెక్ట్ చేసుకుంటుందేమో చూడాలి!

Most Recommended Video

ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus