Sushmita Sen: పెళ్లి కాదు నిశ్చితార్థం కాదు.. అపారమైన ప్రేమ?

బాలీవుడ్ సీనియర్ నటి మాజీ ప్రపంచ సుందరి సుస్మితాసేన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ఇది వరకే పలువురితో రిలేషన్షిప్ లో ఉండి వారితో బ్రేకప్ అయ్యి తిరిగి ప్రస్తుతం ఐపీఎల్ సృష్టికర్త, లలిత మోడీతో రిలేషన్ లో ఉంటుందనే వార్తలు పెద్ద ఎత్తున చెక్కర్లు కొట్టాయి. నాలుగు పదుల వయసు దాటిన ఈమె ఇప్పటికే వివాహం చేసుకోలేదు. కానీ ఇద్దరు చిన్నారులను దత్తత తీసుకొని వారి బాగోగులు చూసుకుంటున్నారు.

సుస్మిత సేన్ పెళ్లి చేసుకోకుండా ఇదివరకే ఇద్దరితో రిలేషన్ లో ఉండి వారితో బ్రేకప్ చెప్పకున్నారు. తాజాగా మూడోసారి ఈమె ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే లలిత్ మోడీ సుస్మిత సేన్ తో ఎంతో చనువుగా ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నా జీవిత భాగస్వామితో కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నాను అంటూ ట్వీట్ చేశాడు. ఇలా ఈ ట్వీట్ వైరల్ కావడంతో పెద్ద ఎత్తున వీరి వ్యవహార శైలి పై కామెంట్లు చేశారు.

ఇదిలా ఉండగా లలిత్ మోడీ ఈ విధమైనటువంటి ట్వీట్ చేయడంతో అందరూ కూడా సుస్మితసేన్ స్పందన తెలుసుకోవాలని ఆత్రుత కనబరిచారు. ఇక లలిత్ మోడీ ట్వీట్ చేసిన కొన్ని గంటల వ్యవధిలో వీరి రిలేషన్ పై సుస్మితసేన్ స్పందించారు. ఈ సందర్భంగా సుస్మితసేన్ తన ఇద్దరి కూతుర్లతో కలిసి దిగిన ఫోటోలను పంచుకుంటూ పెళ్లి కాదు నిశ్చితార్థం కాదు ప్రస్తుతం తాను ఎంతో సంతోషకరమైన ప్రదేశంలో ఉన్నానని ట్వీట్ చేశారు.

కేవలం అపారమైన ప్రేమ అంటూ సుస్మితాసేన్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ పోస్ట్ వైరల్ కావడంతో ఎంతో మంది నెటిజన్లు వీరి వ్యవహారంపై స్పందిస్తున్నారు. ఈ విధంగా సుస్మితసేన్ లలిత్ మోడీ మధ్య ఉన్న సంబంధాన్ని తెలుసుకోవడం కోసం అందరూ ఎంతో ఆత్రుత కనబరుస్తున్నారు.ఏది ఏమైనా ఇలా లేటు వయసులో వీరిద్దరూ ఘాటు ప్రేమలో మునిగి తేలడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus