Sushmita Sen: ‘గోల్డ్ డిగ్గర్’ కామెంట్స్ పై హీరోయిన్ వెటకారం!

బాలీవుడ్ నటి, మాజీ విశ్వసుందరి సుష్మితా సేన్ రెండు, మూడు రోజులుగా వార్తల్లో నిలుస్తోంది. 46 ఏళ్ల ఈ బ్యూటీ కొన్నాళ్లక్రితం వరకు రోహమన్ షాల్ తో రిలేషన్ లో ఉండేది. వారిద్దరికి బ్రేకప్ అయిన తరువాత ఒంటరిగానే ఉంది సుష్మితా. ఆమె దత్తత తీసుకున్న పిల్లలతో కలిసి జీవిస్తోంది సుష్మితా. అయితే ఇప్పుడామె లలిత్ మోడీతో రిలేషన్ లో ఉందని.. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే విషయం హాట్ టాపిక్ గా మారింది.

లలిత్ మోడీతో సుష్మితా సేన్ రిలేషన్ అనగానే అందరూ ఆశ్చర్యపోతున్నారు. సుష్మితా సేన్ అభిమానులు ఈ విషయాన్ని తట్టుకోలేకపోతున్నారు. లలిత్ మోడీ సుష్మితా కంటే వయసులో చాలా పెద్దవాడు. బీసీసీఐలో ఆర్ధిక నేరాలకు పాల్పడినందుకు ఈడీ అతడిపై కేసులు పెట్టింది. దీంతో అతడు దేశం విడిచి పారిపోయాడు. ప్రస్తుతం లండన్ లో సెటిల్ అయ్యారు. ఇలాంటి వ్యక్తిని సుష్మితా ప్రేమించడానికి డబ్బు తప్ప మరో కారణం లేదంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

కొంతమంది ఆమెని గోల్డ్ డిగ్గర్(డబ్బు కోసం ఇతరులతో రిలేషన్ పెట్టుకోవడం) అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఈ కామెంట్స్ సుష్మితాను బాధ పెట్టినట్లు ఉన్నాయి. తన గురించి సోషల్ మీడియాలో వస్తోన్న వార్తలపై ఆమె ఘాటుగా స్పందించింది. ”నాకు పరిచయం లేని వాళ్లు, నా స్నేహితులమని చెప్పుకునేవాళ్ళు, మేధావులమని ఫోజు కొడుతున్నవారు రకరకాల విశ్లేషణలు చేస్తున్నారు.

నా జీవితం గురించి, నా వ్యక్తిత్వం గురించి పెద్ద ఉపన్యాసాలు పెడుతున్నారు. బంగారం కాదు ఇంకా లోతుగా డిగ్ చేస్తా. ఎందుకంటే అప్పుడు వజ్రాలు దొరుకుతాయి. నేనెప్పుడూ వజ్రాలనే ఇష్టపడతా. ఇప్పటికీ నా డబ్బులతో నేను కొనుక్కుంటా” అంటూ ఇన్స్టాగ్రామ్ లో రాసుకొచ్చింది.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!</strong

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus