Swag Teaser Review: శ్రీవిష్ణు హ్యాట్రిక్ కొడతాడా.. ‘స్వాగ్’ టీజర్ ఎలా ఉంది.!

శ్రీవిష్ణు (Sree Vishnu) సినిమాలని యూత్ ఎగబడి చూస్తుంటారు. కామెడీ నేపథ్యంలో శ్రీవిష్ణు కనుక సినిమా చేస్తే కచ్చితంగా హిట్ అనే సెంటిమెంట్ ఉంది. అతను హీరోగా ‘స్వాగ్’ (Swag) అనే సినిమా తెరకెక్కింది. దర్శకుడు హర్షిత్ గోలి, శ్రీవిష్ణు..ల కాంబినేషన్లో ‘రాజ రాజ చోర’ (Raja Raja Chora) అనే సినిమా వచ్చింది. అది మంచి విజయం సాధించింది. కాబట్టి.. ‘స్వాగ్’ పై కూడా ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ హోప్స్ పెట్టుకున్నారు.

Swag Teaser Review

‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థపై ఈ చిత్రాన్ని టి.జి.విశ్వప్రసాద్ (TG Vishwa Prasad) నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లకు మంచి రెస్పాన్స్ లభించింది. తాజాగా టీజర్ ను కూడా వదిలారు 2 నిమిషాల నిడివి కలిగిన ఈ సినిమా టీజర్…వింజామ‌ర వంశ సామ్రాజ్యాన్ని పరిచయం చేస్తూ ప్రారంభమైంది.

ఆ తర్వాత హీరోయిన్లలో ఒకరైన రీతూ వ‌ర్మ (Ritu Varma ) మ‌గాళ్ల‌ని బాసిస‌లుగా చేస్తుంటుంది. ఆ తర్వాత హీరో శ్రీ‌విష్ణు సింగ‌, భ‌వ‌భూతి, య‌య‌తి, కింగ్ భ‌వ‌భూతి వంటి పాత్ర‌ల్లో చిత్ర విచిత్రంగా దర్శనమిచ్చాడు. మంచు లక్ష్మి (Manchu Lakshmi) చెప్పిన ‘ఆడ‌వాళ్లంటే ఆడ‌వాళ్లు’, అలాగే ‘హాయ్ సాగ‌ర్ వాటే స‌డ‌న్ స‌ప్ప‌య్‌’ వంటి వైరల్ మెటీరియల్ కి సంబంధించిన డైలాగ్స్ ఇందులో ఉన్నాయి.

హీరోయిన్ దక్ష నాగర్కర్ (Daksha Nagarkar) , హీరో శ్రీవిష్ణు..ల మధ్య వచ్చే ఓ రొమాంటిక్ సన్నివేశాన్ని కూడా టీజర్లో హైలెట్ చేశారు. టీజర్ అంతా ఏదో గజిబిజిగా అనిపిస్తుంది. మరి సినిమా ఎలా ఉంటుందో. మీరైతే ప్రస్తుతానికి టీజర్ ను ఓ లుక్కేయండి :

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus