టాలీవుడ్ లో నటీనటుల వారసులు నట వారసత్వాన్ని కొనసాగించడం చూశాం.. నిర్మాతల తనయులూ హీరోలుగా సెటిలైన వారూ ఉన్నారు. మూవీ మొఘల్ డి.రామానాయుడు తనయుడు విక్టరీ వెంకటేష్, దర్శక నిర్మాత వి.బి. రాజేంద్ర ప్రసాద్ తనయుడు జగపతి బాబు లాంటి వాళ్లు మూడు దశాబ్దాలకు పైగానే స్టార్స్ గా కొనసాగుతున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం ‘అల్లుడు శీను’ మూవీతో నిర్మాత బెల్లంకొండ సురేష్ తన పెద్ద కొడుకు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ని హీరోగా ఇంట్రడ్యూస్ చేసాడు.
తర్వాత శీను వరుసగా సినిమాలు చేస్తూ ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. తనను నిర్మాతగా నిలబెట్టడమే కాక తన కొడుకుని హీరోగా పరిచయం చేసిన వి.వి.వినాయక్ తోనే ‘ఛత్రపతి’ హిందీ రీమేక్ కోసం తెరవెనుక కష్టపడుతున్నాడు సురేష్. ఇక చిన్న కొడుకు బెల్లంకొండ గణేష్ బాబు విషయానికొస్తే.. ‘స్వాతిముత్యం’ సినిమాతో ఇంట్రడ్యూస్ అయ్యాడు. అన్నకే దిక్కు లేదు మళ్లీ తమ్ముడు కూడానా అంటూ నెగిటివ్ కామెంట్స్ చేశారు.
కట్ చేస్తే ప్రొమోస్ అన్నీ ప్రామిసింగ్ గా అనిపించి సినిమా మీద బజ్ పెంచడమే కాక రిలీజ్ తర్వాత పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఫస్ట్ సినిమాకే హిట్ కొట్టాడు.. పర్ఫార్మెన్స్ బాగుంది. మంచి ఫ్యూచర్ ఉంది అనే కామెంట్స్ వచ్చాయి. హైలెట్ ఏంటంటే చిరంజీవి ‘గాడ్ ఫాదర్’, నాగార్జున ‘ది ఘోస్ట్’ సినిమాలతో పాటు దసరా కానుకగా ఈనెల 5న రిలీజ్ అయ్యింది. పెద్ద సినిమాల మధ్యలో ఎవరు పట్టించుకుంటారులే అనుకున్నారు కానీ యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకుని..
మేకర్స్ ఇదే అసలైన దసరా విన్నర్ అని అనౌన్స్ చేసే వరకూ వెళ్లింది. ఇప్పుడు ‘స్వాతిముత్యం’ ఓటీటీ రిలీజ్ కి ఆహా డేట్ ఫిక్స్ చేసింది. ముందుగా అక్టోబర్ 28 అని ప్రకటించి.. తర్వాత దీపావళి కానుకగా అన్నట్లు అక్టోబర్ 24న స్ట్రీమింగ్ చెయ్యబోతున్నామని కొత్త పోస్టర్ వదిలారు. థియేటర్లో మిస్ అయిన వాళ్లు ఓటీటీకే ఓటేస్తారు కదా మరి..