Swathi Muthyam: ‘స్వాతి ముత్యం’ సినిమా కథ ఆ సినిమాకి కాపీనా?

బెల్లంకొండ గణేష్ హీరోగా పరిచయమవుతూ చేసిన మొదటి చిత్రం ‘స్వాతి ముత్యం’.నూతన దర్శకుడు లక్ష్మణ్ కె కృష్ణ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ నిర్మించాడు. వర్ష బొల్లమ్మ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. అక్టోబర్ 5న విజయదశమి కానుకగా ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది. అదే రోజు ‘గాడ్ ఫాదర్’ ‘ఘోస్ట్’ వంటి పెద్ద సినిమాలు రిలీజ్ అవుతుండడంతో ఈ సినిమా పై అందరి దృష్టి పడింది.

ఓ చిన్న సినిమాని ఏ ధైర్యంతో రెండు పెద్ద సినిమాల మధ్య దింపుతున్నారు అనే ప్రశ్నతో ఈ సినిమా అందరి దృష్టిని ఆకర్షించిందని చెప్పొచ్చు. టీజర్, ట్రైలర్ వంటివి కూడా ప్రామిసింగ్ గా ఉండడంతో కచ్చితంగా ఈ సినిమా మంచి విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి అని అంతా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రం ఓ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది అని చిత్ర బృందం తరచు చెబుతూనే ఉంది. అంతేకాకుండా.. ఓ బోల్డ్ పాయింట్ ను టచ్ చేసినట్టు కూడా నిర్మాత తెలిపారు.

ఆ బోల్డ్ పాయింట్ ఏంటి అన్నది ఆరా తీస్తే.. ‘సినిమా చూసి తెలుసుకోవాలి’ అంటూ మాట దాటేసారు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం.. హీరో సుమంత్ నటించిన ఓ ప్లాప్ సినిమా కాన్సెప్ట్ తోనే ఈ ‘స్వాతి ముత్యం’ తెరకెక్కిందట. 2016 లో సుమంత్ హీరోగా ‘నరుడా డోనరుడా’ అనే చిత్రం రూపొందింది. ఈ చిత్రంలో హీరో తన వీర్యాన్ని దానం చేస్తూ ఉంటాడు. బాలీవుడ్లో సూపర్ హిట్ అయిన విక్కీ డోనర్ కు ఇది రీమేక్.

అయితే ‘నరుడా డోనరుడా’ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది. కానీ ఈ చిత్రాన్ని రిలీజ్ కాకుండా ఆపెయ్యాలి అంటూ కొందరు అభ్యంతరాలు తెలిపారు. ఆ రకంగా ఈ మూవీ కాన్సెప్ట్.. కాంట్రవర్సీకి దారి తీసింది. ‘స్వాతి ముత్యం’ విషయంలో ఇలాంటి కాంట్రవర్సీలు ఎందుకు అనే ఉద్దేశంతో … ఆ కాన్సెప్ట్ ను బయటకు చెప్పడం లేదు అని స్పష్టమవుతుంది.

పోన్నియన్ సెల్వన్: 1 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

నేనే వస్తున్నా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఆరోహి రావ్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus