Swathimuthyam Trailer: ‘స్వాతిముత్యం’ ట్రైలర్..హిట్టు కళ కనిపిస్తుంది!

టాలీవుడ్ లో ఉన్న బడా నిర్మాణ సంస్థల్లో ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ ఒకటి. ఈ బ్యానర్ పై ఏ సినిమా రూపొందినా మినిమం గ్యారెంటీ అనే నమ్మకం ప్రేక్షకుల్లో నెలకొంది. ఈ ఏడాది ఈ బ్యానర్ నుండి వచ్చిన ‘డీజే టిల్లు’ ‘భీమ్లా నాయక్’ సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇప్పుడు దసరా కానుకగా ‘స్వాతిముత్యం’ అనే మరో మూవీ ప్రేక్షకులకు అందించనుంది ఈ సంస్థ. బెల్లంకొండ గణేష్ హీరోగా వర్ష బొల్లమ హీరోయిన్ గా రూపొందిన ఈ చిత్రం టైటిల్ మరియు ఫస్ట్ లుక్ తోనే అందరి దృష్టిని ఆకర్షించింది.

టీజర్ కూడా ఆకట్టుకోవడంతో అంచనాలు పెరిగాయి. తాజాగా ఈ చిత్రం నుండి ట్రైలర్‌ను కూడా విడుదల చేసింది చిత్ర బృందం. ఇప్పటివరకు ‘స్వాతిముత్యం’ అంటే కమల్‌హాసన్ మాత్రమే గుర్తుకొచ్చేవారు. కానీ ఇప్పుడు బెల్లంకొండ గణేష్ ను ‘స్వాతిముత్యం’ గా చూడబోతున్నాం. హీరోగా అతనికి ఇది మొదటి చిత్రం. ఇక ఈ చిత్రం కథ హీరో అమాయకత్వం చుట్టూ, అతని పెళ్లి చుట్టూ తిరుగుతుంది అని ట్రైలర్ స్పష్టం చేసింది.ట్రైలర్ లో వెన్నెల కిశోర్, రావు రమేష్ ల ఫన్ హైలెట్ గా నిలిచింది.

ట్రైలర్ అయితే ఇంప్రెసివ్ గా ఉండడమే కాకుండా సినిమా చూడాలనే ఆసక్తిని కూడా పెంచే విధంగా ఉందని చెప్పొచ్చు.’గాడ్ ఫాదర్’ ‘ఘోస్ట్’ వంటి పెద్ద సినిమాలతో పోటీగా ఈ మూవీ రిలీజ్ అవుతుంది అంటే ఆ రేంజ్ స్టఫ్ ఈ మూవీలో ఉందని ట్రైలర్ తో క్లారిటీ వచ్చింది. అక్టోబర్ 5న విజయదశమి కానుకగా ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. లక్ష్మణ్ కె. కృష్ణ ఈ మూవీకి దర్శకుడు. ట్రైలర్ ను మీరు కూడా ఓ లుక్కేయండి :

కృష్ణ వృంద విహారి సినిమా రివ్యూ & రేటింగ్!


అల్లూరి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఇనయ సుల్తానా గురించి ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్6’ కంటెస్టెంట్ అభినయ శ్రీ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus