Bigg Boss 5 Telugu: సెట్ శ్వేత ఎందుకు డల్ అవుతోంది..?

బిగ్ బాస్ హౌస్ లో బొమ్మల ఫ్యాక్టరీ టాస్క్ పెద్ద దుమారమే లేపింది. ట్విస్ట్ ల పైన ట్విస్ట్ లు ఇచ్చిన బిగ్ బాస్ ఈసారి గ్రీన్ టీమ్ ని అలాగే, సంచాలకులని డిస్ క్వాలిఫై చేశారు. ఇంట్లోని ప్రోపర్టీ అయిన కుషన్స్ ని తీస్కుని వచ్చి అందులో దూదిని వాడుతూ బొమ్మలని తయారు చేసినందుకు శ్వేత, ఇంకా లోబోలని పనిష్ చేశారు. అంతేకాదు, ఆ టీమ్ లో ఉన్న రవిని సైతం పనిష్ చేశాడు బిగ్ బాస్. ఇక ఇది చూసుకోకుండా నిర్లక్ష్యంగా ఉన్నందుకు సంచాలకులని సైతం డిస్ క్వాలిఫై చేశారు. నిజానికి శ్వేతకి, లోబోకి ఈ సలహా ఇచ్చింది రవినే. అందుకే, రవిని సైతం హౌస్ మేట్స్ ఈవారం వరెస్ట్ పెర్ఫామర్ గా ఎంచుకున్నారు.

అయితే, రవికి కేవలం మూడు ఓట్లు మాత్రమే వచ్చాయి. శ్వేతకి నాలుగు ఓట్లు వచ్చాయి అందుకే జైల్ కి వెళ్లాల్సి వచ్చింది. ఇక్కడ తప్పు ఒకరు చేస్తే శిక్ష ఇంకొకరు అనుభవిస్తున్నారంటూ హౌస్ మేట్స్ అభిప్రాయపడ్డారు. కానీ, రవి సలహా ఇచ్చినంత మాత్రానా శ్వేత చేయాల్సిన రూల్ లేదు కదా అనేది పాయింట్ పైన పింకీ శ్వేతతో మాట్లాడింది. ఇక్కడ రవి చేసిన మిస్టేక్ ఉందని శ్వేతకి చెప్పుకొచ్చాడు షణ్ముక్. రవివల్లే నీకు ఈ దుస్తితి వచ్చిందని రవి మీతో చేయించాడు కానీ, చేయలేదు చూసావా ఎందుకు అంటూ మాట్లాడాడు. అంతేకాదు, శ్వేతకి అనీమాస్టర్ కి జరిగిన గొడవలే అనీమాస్టర్ టంగ్ స్లిప్ అయ్యిందని, తొక్కలో రిలేషన్స్ వద్దని సీరియస్ గానే చెప్పిందని అన్నాడు.

దీంతో శ్వేత కళ్లల్లో నీళ్లు తిరిగాయి. మా అమ్మ బ్రతికిఉంటే బాగుండేదంటూ ఏడ్చింది శ్వేత. శ్వేత ఎంతకీ నిద్రపోవట్లేదని మోజ్ రూమ్ లో శ్వేత జైల్ వైపు చూస్తూ అనీమాస్టర్ కూడా మేలుకునే ఉంది. ఇక రవి విషయంలో సెట్ శ్వేతకి సాలిడ్ పంచ్ పడింది. అందుకే బాగా డల్ అయిపోయింది. వరెస్ట్ పెర్ఫామర్ ఇస్తున్నా కూడా యాక్సెప్ట్ చేస్తూ జైలుకు వెళ్లింది సెట్ శ్వేత. మరోవైపు రవిని క్షణించలేకపోతున్నాను అంటూ కాజల్ మానస్ తో డిస్కషన్ అనేది పెట్టింది. అతడి ఫేస్ చూసి నువ్వు మోసపోతున్నావ్ అంటూ మానస్ చెప్పుకొచ్చాడు. సింపతీగా కనిపిస్తాడని అందుకే క్షణించలేకపోతున్నా అంటూ కాజల్ చెప్పింది.

[yop_poll id=”3″]

కొండ పొలం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus