‘ప్రభాస్ 20’ కి మ్యూజిక్ అందిస్తున్న ‘సైరా’ మ్యూజిక్ డైరెక్టర్..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ‘సాహూ’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ, ప్రమోద్ లు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజీత్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక ఈ చిత్రం చేస్తూనే ప్రభాస్ తన 20 వ చిత్రంలో కూడా నటిస్తున్నాడు. ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కబోతుంది.

తాజాగా ఈ చిత్ర షూటింగ్ లో భాగంగా.. ఇటలీ లో మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. 1960 లలో జరిగే ప్రేమకథ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కబోతుండగా… ప్రభాస్ సరసన పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తుంది. టాలీవుడ్ లో మెగాస్టార్ 151 వ చిత్రమైన ‘సైరా నరసింహరెడ్డి’ వంటి భారీ బడ్జెట్ చిత్రానికి సంగీతమందిస్తున్న.. బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది ఈ చిత్రానికి కూడా సంగీతమందిస్తుండడం విశేషం. వీటితో పాటు ‘క్వీన్’ తెలుగు రీమేక్ అయిన ‘దటీజ్ మహాలక్ష్మీ’ చిత్రానికి కూడా అమిత్ త్రివేది నే సంగీతమందిస్తున్నాడు.’సైరా’ టీజర్ కు అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు అమిత్. మరి ప్రభాస్ 20 వ చిత్రానికి ఎలాంటి మ్యూజిక్ అందిస్తాడో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus