అతని యాక్టింగ్ స్కిల్స్ చూసి ఆశ్చర్యపోయాను : తాప్సి

తాప్సి పన్ను… ఈ నటి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కెరీర్ ప్రారంభంలో తెలుగులో వరుసగా సినిమాలు చేసింది. అయితే ఒక్క ‘మిస్టర్ పర్ఫెక్ట్’ చిత్రానికి తప్ప.. మరే చిత్రంలో కూడా ఈమె నటనకు మంచి గుర్తింపు దక్కలేదు. ఈ క్రమంలో ఎక్కువ మంది కుర్ర హీరోయిన్లు ఎంట్రీ ఇవ్వడంతో సహజంగానే ఈమెకు అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. దీంతో ఈమె ఇక్కడ కష్టం అని ప్రిపేర్ అయిపోయి… బాలీవుడ్ కు చెక్కేసింది. అక్కడ హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు తీసి వరుస హిట్లు అందుకుంది.

దీంతో ఈమెను బాలీవుడ్ ప్రేక్షకులు నెత్తి పై పెట్టుకున్నారు. అక్కడ ఈమె క్రేజ్ కూడా పీక్స్ లో ఉంది. ఇదిలా ఉంటే… ఈమె ఓ నటుడుని ప్రశంసలతో ముంచెత్తుతుంది. ఇటీవల బాలీవుడ్ గ్రేట్ యాక్టర్ రిషి కపూర్ మరణించిన సంగతి తెలిసిందే. నటనలో తనను ఓడించగల నటుడు కేవలం రిషి కపూర్ మాత్రమేనని తాప్సీ ప్రశంసలు కురిపించింది. ‘రిషి కపూర్ మరణ వార్త నన్ను విషాదంలోకి నెట్టేసింది. ‘ముల్క్’ చిత్రంలో మేమిద్దరమూ కలిసి నటించాము.

ఆయన యాక్టింగ్ స్కిల్స్ చూసి నేను ఆశ్చర్యపోయాను. ఏ పాత్రలోనైనా అతను పరకాయ ప్రవేశం చేసేస్తాడు. అటువంటి నటుడిని నేను ఇప్పటి వరకూ చూడలేదు.ఆయనతో రెండుసార్లు పనిచేసే అవకాశం రావడం నా అదృష్టం గా భావిస్తాను. ఆయన నన్ను ఎంతగానో ఎంకరేజ్ చేసారు. ఆయన కెరీర్ లో ఎన్నో ఎంటర్టైన్మెంట్ సినిమాల్లో నటించారు. అలాంటి గొప్ప నటుడితో 3 వసారి కూడా నటించే అవకాశం వస్తుందని భావించాను. ఎప్పటికైనా మిమ్మల్ని కలుస్తాను. మళ్ళీ ఇలాంటి ఆప్యాయపూర్వక కౌగిలింతను తీసుకుంటాను” అంటూ ఎమోషనల్ గా పోస్ట్ పెట్టి ఓ ఫోటోని కూడా షేర్ చేసింది తాప్సి.

Most Recommended Video

‘బాహుబలి’ ని ముందుగా ప్రభాస్ కోసం అనుకోలేదట…!
పోకిరి స్టోరీకి మహేష్ చెప్పిన చేంజెస్ అవే..!
హీరోయిన్స్ గా ఎదిగిన హీరోయిన్స్ కూతుళ్లు వీరే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus