ఢిల్లీ భామ తాప్సి ఝుమ్మంది నాదం సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైంది. హీరోయిన్ గా అ వకాశమించిన దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావుని విమర్శించింది. “వందకు పైగా సినిమాలు చేసిన రాఘవేంద్రరావు హీరోయిన్ ల బొడ్డు మీద పువ్వులు, పండ్లు వేయడం ఏంటో ? నాకు ఇప్పటికీ అర్థం కాలేదని, అలా వేస్తేనే హీరోయిన్ల అందాలు బయట పడతాయా?” అని ఓ ఇంటర్వ్యూ లో హేళన చేసింది. దీనిపై తెలుగు పరిశ్రమలోని నటీనటులు, టెక్నీషయన్లు, ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు ఫిలిం ఛాంబర్ పెద్దలు.. తాప్సి పై నిషేధం విధించాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న తాప్సి విమర్సలను వెనక్కు తీసుకుంది.
రాఘవేంద్రరావు పై చేసిన కామెంట్స్ ఉద్దేశపూర్వకంగా చేసినవి కావని, సరదాగా ఓ షోలో చెప్పానని, అవి ఎవరినైనా బాధ కలిగించి ఉంటే క్షమించాలని కోరింది. రెండు నిముషాలు పాటు ఆమె మాట్లాడిన వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఈ వివాదానికి తెరదించింది. తాప్సి సారీ చెప్పడంతో తెలుగు సినీపెద్దలు, అభిమానులు శాంతించారు. ఇక తాప్సి చాలా గ్యాప్ తర్వాత నటించిన “ఆనందో బ్రహ్మ” వచ్చే నెలల్లో రిలీజ్ కానుంది.