Taapsee: ‘ఇలాంటి బాడీ తాప్సీకి మాత్రమే ఉంటుంది’

బాలీవుడ్ లో వరుసగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ టాప్ రేసులో దూసుకుపోతుంది తాప్సీ. అప్పుడప్పుడు సౌత్ లో ఒకట్రెండు సినిమాలు చేస్తున్నప్పటికీ.. ఎక్కువగా బాలీవుడ్ సినిమాలే చేస్తుంది. ప్రస్తుతం ఆమె నటించిన ‘రష్మీ రాకెట్’ సినిమా ఓటీటీలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో తాప్సీ.. గుజరాతీ స్పింటర్‌ రష్మీ పాత్రలో నటిస్తోంది. అథ్లెట్ బాడీ కోసం ఈ నటి చాలా కష్టపడింది. ఈ విషయంలో చాలా మంది తాప్సీను ప్రశంసించారు.

అయితే ఇటీవల సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాప్సీ వెనక్కి తిరిగి ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘ఎవరో చెప్పుకోండి..?’ అని క్యాప్షన్ జోడించింది. అది చూసిన ఓ నెటిజన్.. ‘ఇలాంటి మగాడి శరీరం తాప్సీ పన్నుకే ఉంటుందని’ కామెంట్ పెట్టాడు. ఈ పోస్ట్ పై స్పందించిన తాప్సీ.. ‘నేను చెబుతున్నా.. ఈ లైన్ గుర్తుపెట్టుకొని సెప్టెంబర్ 23వరకు వేచి ఉండు. నేను ఈ ప్రశంస కోసం చాలా కష్టపడ్డాను. మీకు ధన్యవాదాలు’ అంటూ ఘాటుగా బదులిచ్చింది.

ఈ విషయంలో చాలా మంది సెలబ్రిటీలు, అభిమానులు తాప్సీకి మద్దతుగా కామెంట్స్ పెడుతున్నారు. తాప్సీ కామెంట్ ని బట్టి ఈ సినిమా ట్రైలర్ ను సెప్టెంబర్ 23న విడుదల చేయనున్నారని తెలుస్తోంది. ఇక సినిమాను అక్టోబర్ 15న జీ5 యాప్ లో విడుదల చేయనున్నారు.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బిగ్ బాస్5’ మానస్ గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ లహరి షెరి గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ ప్రియా గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus