Taapsee: పొగడ్తల కోసం నేను ఆరాటపడను…తాప్సీ కామెంట్స్ వైరల్!

నటిగా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతూ వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి నటి తాప్సీ గురించి పరిచయం అవసరం లేదు. తెలుగులో ఝుమ్మంది నాదం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈమె అనంతరం పలు చిత్రాలలో నటించి సందడి చేశారు. అయితే బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో పాటు నిర్మాణ రంగంలో కూడా బిజీగా గడుపుతున్నారు. ఇకపోతే తాజాగా ఓ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె తన గురించి అలాగే ఇండస్ట్రీలో కొందరి సెలబ్రెటీల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా తాప్సీ మాట్లాడుతూ కొందరు నటీనటులు మాదిరిగా నాకు కెమెరాలు ముందు నటించడం రాదని తెలిపారు. తాను కెమెరా ముందు అయినా వెనక అయినా ఎప్పుడు ఒకే విధంగా వ్యవహరిస్తానని, తాను ఎప్పుడు నిజాయితీగానే ఉంటానని తెలియజేశారు. ఇటీవల కాలంలో ఫోటోగ్రాఫర్లపై నేను సీరియస్ అయినటువంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వాటిని చూసి కొందరు సెలబ్రిటీలు విమర్శలు చేశారు. మరి కొందరు నెటిజన్స్ నెగిటివ్ కామెంట్లతో ట్రోల్ చేశారు.

వారి మాటల వల్ల నేను చాలా బాధపడ్డాను అని సోషల్ మీడియాకు కూడా దూరం కావాలని భావించాలని ఈమె తెలిపారు. ఎదుటివారి పొగడ్తల కోసం నేను ఆరాటపడనని నాకు నచ్చిన విధంగానే నేను వ్యవహరిస్తూ ఉంటానని ఈమె తెలిపారు. ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు మనకు మనసుకు అనిపించినది మాట్లాడినప్పుడే చాలా ప్రశాంతంగా ఉంటుందని తెలిపారు.

సమాజంలో మంచి మార్కులు కొట్టేయడానికి కొంతమంది నటిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ నిజస్వరూపాలు బయటపడినప్పుడు ప్రజలలో వారికి ఉన్న గౌరవం దెబ్బతింటుందని ఈ సందర్భంగా ఈమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus