Taapsee Pannu: ”మనం వినడానికి ఇదొక్కటే మిగిలుంది”: తాప్సీ

టాలీవుడ్ లో గ్లామరస్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న తాప్సీ బాలీవుడ్ కి వెళ్లిన తరువాత తన పంథా మార్చుకుంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ బాగా పాపులర్ అయింది. నటిగా ఆమె ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. సామాజిక అంశాలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఉంటుంది. ముఖ్యంగా మహిళలపై జరిగే దాడులు.. అఘాయిత్యాలకు వ్యతిరేకంగా మాట్లాడుతుంటుంది. తాజాగా అలాంటి ఘటనపై తాప్సీ స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అత్యాచారం కేసులో ఛత్తీస్‌గఢ్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పుని వ్యతిరేకిస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

”అంతే.. ఇప్పుడు మనం వినాల్సిన వాటిలో ఇది మాత్రమే మిగిలింది” అంటూ తాప్సీ అసహనం వ్యక్తం చేసింది. కాగా.. భార్యపై భర్త అత్యాచారానికి పాల్పడిన కేసులో ఛత్తీస్‌గఢ్‌ హైకోర్టు ఈరోజు సంచలన తీర్పు వెలువరించింది. వివాహం చేసుకున్న భార్య ఇష్టానికి విరుద్ధంగా.. బలవంతంగా శృంగారం చేస్తే చట్ట ప్రకారం నేరం కాదని.. అది అత్యాచారం కిందకి రాదంటూ కోర్టు స్పష్టం చేసింది. అయితే భార్య వయసు 18 ఏళ్ల కంటే తక్కువ ఉండకూడదని హైకోర్టు తన తీర్పులో పేర్కొంది.

అంతేగాక ఈ కేసులో భర్తను నిర్దోషిగా విడుదల చేస్తూ.. ఛత్తీస్‌గఢ్‌ హైకోర్టు జడ్జి ఎన్ కె చంద్రవంశీ తీర్పు వెలువరించారు. ఈ తీర్పుపై తాప్సీతో పాటు పలువురు సినీ ప్రముఖులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సింగర్ సోనా మోహాపాత్రా కూడా కోర్టు తీర్పుని వ్యతిరేకిస్తూ పోస్ట్ పెట్టింది.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus