హీరో కానివ్వండి, హీరోయిన్ కానివ్వండి తాము ఒప్పుకొన్న సినిమా కోసం వందశాతం కష్టపడతారు. పాత్రకు అవసరమైనట్లు తమ బాడీ లాంగ్వేజ్ మొదలుకొని రూపు రేఖలు వరకూ అన్నీ మార్చుకోవడానికి కష్టపడతారు, ప్రయత్నిస్తారు, సాధిస్తారు. అయితే సినిమా కోసం పడిన ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తే అప్పటివరకూ పడిన కష్టాన్ని ఆ విజయానందంలో మర్చిపోతారు. కానీ.. పొరపాటున ఆ ఫలితం వేరేలా ఉంటే మాత్రం తెగ బాధపడిపోతారు. ఇప్పుడు టాప్సీ పరిస్థితి అలానే తయారయ్యింది. హాకీ ప్లేయర్ సందీప్ సింగ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన “సూర్మ” చిత్రం కోసం తాప్సీ స్పెషల్ గా హాకీలో ట్రయినింగ్ కూడా తీసుకొంది. దాదాపు 5 నెలలు స్పెండ్ చేసింది.
కానీ.. నిన్న విడుదలైన “సూర్మ” ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. సినిమాలో ఎమోషన్ అనేది లేకపోవడం, ప్రేక్షకుల్ని ఆకట్టుకొనే అంశాలు కూడా పెద్దగా లేకపోవడంతో సినిమాకి బాలీవుడ్ లో కనీస స్థాయి గుర్తింపు కూడా లభించలేదు. ముఖ్యంగా విశ్లేషకులు ఈ చిత్రానికి మినిమమ్ రేటింగ్స్ కూడా ఇవ్వలేదు. అందువల్ల సినిమాకి ఓపెనింగ్స్ కూడా రాలేదు. సినిమాలో కూడా తాప్సీకి సరైన స్క్రీన్ టైమ్ లభించలేదు. మరి నెక్స్ట్ సినిమాతోనైనా తాప్సీ మళ్ళీ సక్సెస్ అందుకోవాలని కోరుకొందాం.