KA Movie: కిరణ్ అబ్బవరం ‘క’ విడుదలకు ముందే టేబుల్ ప్రాఫిట్!

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram)  ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్‌తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. తాజాగా ఆయన నటించిన థ్రిల్లర్ మూవీ ‘క’ (KA) విడుదలై, ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంది. ఈ సినిమా విడుదలకు ముందే ప్రీమియర్ షోలు వేశారు, అలాగే ట్రైలర్ విడుదల సమయంలోనే పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది. కిరణ్ అబ్బవరం కూడా ఈ సినిమాపై తన నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ, ప్రేక్షకులు ఈ సినిమా నచ్చకపోతే ఇక సినిమాలు చేయడం మానేస్తానంటూ సవాల్ విసిరారు.

KA Movie

ఇది ఇలా ఉండగా, ‘క’ సినిమా విడుదలకు ముందే టేబుల్ ప్రాఫిట్ సాధించినట్లు తెలుస్తోంది. కిరణ్ అబ్బవరం ఈ సినిమాకి సహా నిర్మాతగా ఉండటం విశేషం. 15 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా, కిరణ్ రెమ్యూనరేషన్‌ను మినహాయించి లాభాల్లోకి వచ్చింది. తెలుగు వెర్షన్ రిలీజ్ రైట్స్ దాదాపు 12 కోట్లకు అమ్ముడవ్వగా, డిజిటల్ రైట్స్ ఈటీవీకి 10 కోట్లకు అమ్మడైనట్లు సమాచారం. అంటే సినిమా విడుదలకు ముందే పెట్టుబడి తిరిగి రావడంతో పాటు 6 కోట్ల లాభం వచ్చిందని తెలుస్తోంది.

ఇక థియేట్రికల్ రిలీజ్‌లో ఈ సినిమా నుంచి వచ్చే కలెక్షన్లు మొత్తం ప్రాఫిట్‌లోకి వెళ్లనున్నాయి. కిరణ్ అబ్బవరం తన కెరీర్‌లోనే హైయెస్ట్ బడ్జెట్‌తో చేసిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలై ఇతర భాషల్లో కూడా మంచి వసూళ్లు సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. పాజిటివ్ టాక్ ఉండటంతో పాటు, ఫెస్టివల్ వీకెండ్‌లో విడుదల కావడం సినిమాకు మరింత కలిసొచ్చే అంశంగా భావిస్తున్నారు.

ఈ మూవీ విజయం సాధిస్తే, కిరణ్ అబ్బవరం కెరీర్ మరలా ట్రాక్‌లో పడే అవకాశముందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో మినిమం గ్యారంటీ హీరోగా ఎదగడానికి, కిరణ్ అబ్బవరానికి ఈ మూవీ సహకరించనుందని అంటున్నారు.

NBK109: అందుకే ఈ ఆలస్యం!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus