Naa Saami Ranga: ‘నా సామి రంగ’ బిజినెస్ … అప్పుడే లాభాలు!

అక్కినేని నాగార్జున హీరోగా ‘నా సామి రంగ’ సినిమా రూపొందుతుంది. జనవరి 14న రిలీజ్ చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. కానీ షూటింగ్ పార్ట్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. మరో రెండు రోజుల్లో కంప్లీట్ అయిపోతుంది అని అంచనా..! ఈ చిత్రంతో విజయ్ బిన్నీ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ‘శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్’ బ్యానర్ పై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. అల్లరి నరేష్, రాజ్ తరుణ్ వంటి హీరోలు కూడా నటిస్తున్న సినిమా ఇది.

మలయాళంలో రూపొందిన ‘పొరింజు మరియం జోస్’ అనే సినిమాకి ఇది రీమేక్. అయితే తెలుగు ప్రేక్షకుల అభిరుచి మేరకు మంచి మార్పులే చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ‘నా సామి రంగ’ సినిమాకి పారితోషికాలు మినహా ఎక్కువ బడ్జెట్ అవ్వలేదు అని ఇన్సైడ్ టాక్. మరోపక్క ‘నా సామి రంగ’ నాన్ థియేట్రికల్ రైట్స్ ను మొత్తంగా రూ.21 కోట్లు పెట్టి కొనుగోలు చేసినట్లు సమాచారం. అంటే చాలా వరకు పెట్టిన పెట్టుబడి రికవరీ అయిపోయినట్టే అని చెప్పాలి.

ఈ సినిమా (Naa Saami Ranga) టీజర్ వల్ల బజ్ క్రియేట్ అయ్యింది. అందుకే నాన్ థియేట్రికల్ రైట్స్ బిజినెస్ బాగా జరిగినట్లు స్పష్టమవుతుంది. అయితే థియేట్రికల్ రైట్స్ పరంగా ఈ సినిమాకి ఎక్కువ బిజినెస్ జరగడం లేదట. సంక్రాంతికి ఎక్కువ సినిమాలు ఉండటంతో అడ్వాన్సులు చెల్లించి రిలీజ్ చేయడానికే బయ్యర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట. అలా అయినా నిర్మాత శ్రీనివాసా చిట్టూరికి టేబుల్ ప్రాఫిట్స్ దక్కినట్టే అని తెలుస్తుంది.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus