Bigg Boss 5 Telugu: హౌస్ లో ట్యాగ్ లైన్స్ ఇచ్చుకున్న హౌస్ మేట్స్..!

  • November 15, 2021 / 10:41 AM IST

బిగ్ బాస్ హౌస్ లో సండే ఫన్ డే కాస్త భారంగానే గడిచింది. ఇందులో భాగంగా కొన్ని ఫన్ గేమ్స్ ఆడించిన హౌస్ట్ నాగార్జున తర్వాత ఒక్కొక్కరికీ ఒక్కో ట్యాగ్ ని మెడలో వేయమని చెప్పాడు. మెడలో మెడల్ అంటూ ఈ గేమ్ ఆడించాడు. ఫస్ట్ సన్నీ రవికి ఫేక్ మెడల్ వేసి గేమ్ ని స్టార్ట్ చేశాడు. రవిని ఉద్దేశ్యించి మాట్లాడుతూ.. మనోడు సిట్యువేషన్ ని తనకి అనుకూలంగా మార్చుకుంటూ ఫేక్ గేమ్ అడతాడని చెప్పాడు సన్నీ. ఆ తర్వాత మానస్ ప్రియాంకని హెడ్డేక్ అంటూ మెడల్ ని మెడలో వేశాడు. శ్రీరామ్ మాత్రం కాజల్ కి కన్నింగ్ ట్యాగ్ వేశాడు.

గేమ్ లో చాలా కన్నింగ్ ఉంటుందని, కన్నింగ్ కాజల్ అంటూ అభిప్రాయపడ్డాడు. ఇక తర్వాత రవి అనీమాస్టర్ ని ఆరోగెంట్ అని, చెప్పినా కూడా మాట వినదని అన్నాడు. తన నిద్ర డిస్టర్బ్ అయిన కారణంగా పిల్లిలా మియామ్ మియామ్ అని అరుస్తూ రాత్రిపూట అందర్నీ నిద్రలేపిందని చెప్పినా వినలేదని అన్నాడు. ఇక ప్రియాంక తనని హెడ్డేక్ అన్న మానస్ ని కూడా హెడ్డేక్ అని చెప్తూనే సెల్ఫిష్ బోర్డ్ ని షణ్ముక్ మెడలో వేసింది. ఇక్కడ సెల్ఫిష్ ఎందుకో ప్రియాంక సరిగ్గా చెప్పలేకపోయింది. తర్వాత అనీమాస్టర్ సన్నీకి సెల్ఫిష్ అంటూ బోర్డ్ తగిలించింది.

తను తినాల్సిన కేక్ ని సన్నీ తినేశాడని, అందుకే సెల్ఫిష్ అంటూ మాట్లాడింది అనీమాస్టర్. కాజల్ సిరిని డబుల్ ఫేస్డ్ అంటూ ట్యాగ్ ఇచ్చింది. ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు అని, గేమ్ లో ఒకలాగా ఉంటుంది, మాములుగా ఒకలా ఉంటుందని చెప్పింది. అంతేకాదు, ఇంకో ఫేస్ కూడా ఉందని అది బయటకి వెళ్లాక చూపిస్తానని చాలాసార్లు నాతో చెప్పిందని కాజల్ చెప్పింది. తర్వాత సిరి షణ్ముక్ ఎప్పుడూ నా విషయంలో నెగిటివ్ గా చెప్తాడని నెగిటివ్ బోర్డ్ ని మెడలో వేసింది. అలాగే షణ్ముక్ కూడా సిరి డబుల్ ఫేస్డ్ అంటూ అదే బోర్డ్ ని మెడలో తగిలించాడు. ఇలా ఫన్నీగా ఆడినా కూడా హౌస్ మేట్స్ ఒకరినొకరు నిందించుకుంటూ ఈ మెడల్స్ ని మెడలో తగిలించారు. అదీ మేటర్.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus