Tamannaah: తమన్నా షేర్ చేసిన మెహందీ పిక్ వైరల్..!

సెలబ్రిటీల వెడ్డింగ్స్‌కి సంబంధించి ఇప్పటివరకు ఎన్నో రకాల వార్తలు చూశాం.. కానీ తమన్నా పెళ్లి విషయంలో మాత్రం వ్యవహారం కాస్త వెరైటీగానే ఉంది.. కొద్దిరోజులుగా మిల్కీబ్యూటీ మ్యారేజ్ ముంబైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్తతో జరుగబోతుందని వార్తలు వైరల్ అవుతున్నాయి.. ఇటీవల ‘‘ప్రొఫెషనల్‌‌‌గా బిజీగా ఉండడం వల్ల పర్సనల్ లైఫ్ మీద పెద్దగా ఫోకస్ చెయ్యలేకపోయాను.. పెళ్లికి నేనేం వ్యతిరేకిని కాను.. వీలు చూసుకుని, వెడ్డింగ్ చేసుకుని పిల్లల్ని కూడా కంటాను’’ అని కామెంట్ చేసింది..

అప్పటినుండి తమ్మూ పెళ్లిపై రకరకాల వార్తలు వస్తూనే ఉన్నాయి.. వచ్చిన ప్రతీసారీ అమ్మడు తన స్టైల్లో సోషల్ మీడియా ద్వారా రెస్పాండ్ అవుతూనే ఉంది. కెరీర్ స్టార్ట్ చేసి 15 ఏళ్లకు పైనే అయింది.. కాజల్, నయనతార లాంటి వాళ్లు అమ్మతనాన్ని ఆస్వాదిస్తున్నారు.. తనకంటే చిన్నదైన హన్సిక కూడా కాబోయే వాణ్ణి పరిచయం చేసేసింది.. ఇక తమన్నా వంతే అని కాస్త గట్టిగానే ఫిక్స్ అయిపోయారు.. అందరూ అనుకుంటున్నట్టుగానే తమన్నా తను కట్టుకోబోతున్న వ్యక్తి ఎవరనేది రివీల్ చేసేసింది..

తన పెళ్లి మాట నిజమేనంటూ.. చీరతో లోపలికి వెళ్లి.. మగాడి వేషంలో బయటకొచ్చి.. ‘‘ఇంట్రడ్యూసింగ్ మై బిజినెస్‌మెన్ హస్బెండ్’’.. అంటూ తన పెళ్లి గురించి పోస్ట్ చేసిన పేజ్‌ని ట్యాగ్ చేసింది.. అంతేనా.. ‘‘మ్యారేజ్ రూమర్స్.. ప్రతిఒక్కరూ నా లైఫ్ గురించి స్క్రిప్ట్ రాసేస్తున్నారు’’ అనే హ్యాష్ ట్యాగ్స్ కూడా యాడ్ చేసింది.. ఇదిలా ఉంటే.. ఇప్పుడు మరోసారి తమన్నా మ్యారేజ్ మేటర్ చక్కర్లు కొడుతోంది. దానికి కారణం మిల్కీబ్యూటీ మెహందీ పెట్టుకున్న పిక్ పోస్ట్ చేయడమే.

దానికి ‘మెహండేటరీ’ అని కామెంట్ చేసింది. ఇంకేముంది.. తమన్నా గుడ్ న్యూస్ చెప్పబోతుందా!.. అంటూ ఆశ్చర్యంతో కూడిన అనుమానపు కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.. తమ్మూ పెళ్లి కూతురవుతుంది కాబట్టే మెహందీ పెట్టుకుందని కొందరు.. కాదు, ఎవరైనా ఫ్రెండ్ లేదా రిలేటివ్స్ వెడ్డింగ్‌కి వెళ్లుంటుంది అని మరికొందరు అంటున్నారు. మెహందీ ఫోటో మేటర్ ఏంటనేది తమన్నా చెప్పే వరకు ఈ వార్తలు ఆగవు..

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus