సినిమా హిట్టవ్వడం… ప్లాప్ అవ్వడం అనేది ఎవ్వరి చేతిలోనూ ఉండదు. కానీ ప్లాప్ అయితే మాత్రం దాని ఎఫెక్ట్ ఏదో ఒక రూపంలో ఆ సినిమాలో నటించిన వాళ్ళ పై పడుతుంది. ఇప్పుడు తమన్నా కూడా తన ప్లాప్ సినిమాని తలుచుకుని తెగ బాధ పడుతుంది. ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటున్న తమన్నా… ఓ ఆంగ్ల పత్రికకు వీడియో కాల్ ద్వారా ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో భాగంగా కొన్ని ఆసక్తి కరమైన విషయాల్ని చెప్పుకొచ్చింది. ముఖ్యంగా తన ప్లాప్ సినిమాని తలుచుకుని తెగ బాధ పడుతుంది.
తమన్నా మాట్లాడుతూ… “హీరోయిన్ గా నేను బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన మొదటి చిత్రం ‘హిమ్మత్‌వాలా’. ఆ చిత్రం పెద్ద ప్లాప్ అయ్యింది. దాని వల్ల నా కెరీర్ కు పెద్ద దెబ్బ పడిందనే చెప్పాలి. అంతేకాదు నా జీవితంలో నేను చాలా కష్టపడిన ఫేస్ కూడా అదే. అయితే ఆ సినిమా ప్లాపయిన టైములో వేర్వేరు ఇండస్ట్రీలలో సినిమాలు చేస్తూ బిజీగా ఉండిపోయాను. వరుసగా షూటింగ్స్ ఉండడంతో నేను బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన సినిమా ప్లాప్ అయ్యిందని ఎక్కువగా ఆలోచించలేదు.
ఒక్కసారే 4-5 సినిమాల్లో నటించడం వల్ల ఈ సినిమా ఏ విధంగా ప్లాప్ అయ్యింది అనే విషయాన్ని కూడా నేను అనలైజ్ చేసుకోలేదు. అయినప్పటికీ ప్లాప్ అనేది ఏదో ఒక రకంగా మంచికే అనుకుంటున్నాను. అప్పుడే మంచి కథని ఎంచుకోవాలి అని మొదటి దశలోనే జాగ్రత్తపడతాం.
Most Recommended Video
అమృతారామమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బాహుబలి’ ని ముందుగా ప్రభాస్ కోసం అనుకోలేదట…!
తండ్రికి తగ్గ తనయలు అనిపిస్తున్న డైరెక్టర్స్ కూతుళ్లు