నాగార్జున , కార్తీ, తమన్నా కాంబినేషన్లో రూపొందిన భారీ మల్టీస్టారర్ మూవీ ఊపిరి. తెలుగు, తమిళ్ లో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన ఊపిరి ఈనెల 25న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా మిల్కీబ్యూటీ తమన్నా మాట్లాడుతూ …
నా క్యారెక్టర్ పేరు కీర్తి. బిలియనీర్ పి.ఎ కాబట్టి బాగా చదువుకుని బాధ్యత గల అమ్మాయిగా కనిపిస్తాను. అలాగే స్ట్రాంగ్ ఉమెన్ ఎలా ఉంటుందో అలా నా క్యారెక్టర్ ఉంటుంది. ఇది రీమేక్ కాదండి. ఫ్రెంచ్ మూవీ ది ఇన్ టచ్ బుల్స్ సినిమా స్పూర్తితో తీసిన సినిమా ఇది. ఓరిజినల్ ఎలా ఉందో అలా తీస్తే ఇక్కడ ఎక్సప్ట్ చేయరు. అందుచేత ఇండియన్ ఆడియోన్స్ కి తగ్గట్టు మార్పులు చేసారు. ఇంకా చెప్పాలంటే ఈ సినిమాకి భాష అవసరం లేదు. ఓరిజినల్ వెర్షన్ మూవీ నేను చూడలేదు. .కాకపోతే నా క్యారెక్టర్ లో చాలా మార్పులు చేశారు.
తెలుగులో డబ్బింగ్ చెబితే బాగుంటుందని నా మనసులో మాటను డైరెక్టర్ వంశీకి చెప్పాను. వెంటనే వంశీ ఓకే అన్నారు. భవిష్యత్ తో పాత్ర డిమాండ్ చేస్తే డబ్బింగ్ చెబుతాను. నాగార్జునగారు చేసిన క్యారెక్టర్ చేయడం చాలా కష్టం. కాళ్ళు చేతులు కదపకుండా కేవలం ఎక్స్ ప్రెషన్స్ మాత్రమే ఇవ్వాలంటే మామూలు విషయం కాదు. నాగార్జున గారు ఒక ఛాలెంజ్ గా తీసుకుని ఈ క్యారెక్టర్ చేసారు. ఆయన్ని చూసి చాలా మంది నటులు స్పూర్తి పొందుతారు. తెలుగు సినిమాని ఊపిరి మార్చేస్తుంది.
బాహుబలి 2 లో నా క్యారెక్టర్ తక్కువుగానే ఉంటుంది. షూటింగ్ ఎప్పుడు ఎక్కడ అనేది ఇంకా తెలియదు. ఇలాంటి సినిమాలో పాత్ర నిడివి చిన్నదా..? పెద్దదా అని కాదు నటించడమే గ్రేట్ అని నా ఫీలింగ్. తమిళ్ లో ధర్మదొరై మూవీ చేస్తున్నాను. బాహుబలి 2 చేస్తున్నాను. ప్రభుదేవా రూపొందిస్తున్న త్రిభాషా చిత్రంలో నటిస్తున్నాను” అన్నారు.