Tamanna: నాలో కసి ఏమాత్రం తగ్గలేదు: తమన్నా

క్యూట్‌ అమ్మాయిగా సినిమా ఇండస్ట్రీలో ప్రయాణం ప్రారంభించి మిల్కీ బ్యూటీగా మారి టాప్‌ హీరోయిన్‌ అయ్యింది తమన్నా. ఇండస్ట్రీలోకి వచ్చి ఇన్నేళ్లయినా ఇంకా అదే క్రేజ్‌తో దూసుకుపోతోంది. తాజాగా ‘గుర్తుందా శీతాకాలం’ అంటూ ఓ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘‘జయాపజయాల్ని నేనెప్పుడూ సమంగానే చూస్తాను. అయితే వ్యక్తిగతంగా విజయాల కన్నా.. పరాజయాల నుంచే ఎక్కువ నేర్చుకోగలిగాను’’ అని చెప్పింది. పెద్ద హీరో.. చిన్న హీరో అనే లెక్కలే నేను ఏ రోజూ వేసుకోను.

నేను ఎవరితో నటించినా సినిమాను సినిమాలాగే చూస్తాను. ‘ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య’ చూశాక సత్యదేవ్‌తో నటిస్తే బాగుండు అనిపించింది. ఆ అవకాశం ‘గుర్తుందా శీతాకాలం’తో తీరింది. ఇండస్ట్రీలో అడుగు పెట్టినప్పుడు ఇన్నేళ్లు ఉంటానని అనుకోలేదు. ఇన్నేళ్లుగా ఇక్కడున్నా సినిమాలపై నాకున్న ప్రేమ, కసి ఏమాత్రం తగ్గలేదు. సినిమాల్లోకి వచ్చిన తొలి రోజుల్లో ఎలా ఉన్నానో, ఇప్పుడూ అలానే ఉన్నాను. ఇప్పటివరకు నటిగా మంచి పాత్రలు చేశాను, ఇకపై అదే దిశగా ఎంపిక చేసుకుంటాను.

భవిష్యత్తులో నిర్మాతగా మారాలనే ఆలోచనలు కూడా ఉన్నాయి. ఇన్ని రోజులు ఇక్కడ ఉన్నాను అంటే.. దానికి కారణం నేను ఎప్పుడూ నన్ను స్టార్‌గా ఊహించుకోలేదు. నన్ను నేను ఓ మంచి నటిగానే చూసుకోవాలనుకున్నా. అదే నా లాంగ్‌ వర్క్‌ లైఫ్‌కి కారణం. పాత్ర నిడివిని దృష్టిలో పెట్టుకొని సినిమాలు ఎంచుకోవడం నాకు అలవాటు లేదు. చిన్న పాత్ర అయినా కథలో కీలకంగా ఉంటే చాలు అనుకునే రకం. ‘సైరా’ సినిమాలో నా పాత్ర నిడివి తక్కువే అయినా ప్రభావం కథలో బలంగా కనిపిస్తుంది.

ఇక నా పెళ్లిపై ఇప్పటికే బోలెడన్ని వార్తలొచ్చాయి. ఓ డాక్టర్‌తో వివాహం జరిగినట్లు కూడా రాసేశారు. త్వరలో ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకోనున్నట్లు వదంతులు కూడా వచ్చాయి. అయితే పెళ్లి జీవితంలో ఒక అందమైన పార్ట్‌. దాని గురించి సందర్భం వస్తే వేడుకలా అందరికీ చెబుతాను. అప్పటివరకు అందరూ సంయమనం పాటించడండి. మా ఇంట్లో వాళ్లూ పెళ్లి చేసుకోమని అడుగుతున్నారు. అయితే కంగారేం పెట్టడం లేదు అని క్లారిటీ ఇచ్చింది తమన్నా.

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus