Tamannaah: నీ మొహానికి హీరోయిన్ అవుతావా అని దారుణంగా అవమానించారు : తమన్నా

టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీ తో సంబంధం లేకుండా వరుసగా అగ్ర హీరోల సరసన నటించి మోస్ట్ బిజియస్ట్ హీరోయిన్ గా మారిపోయిన తమన్నా భాటియా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మిల్క్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న ఈ భామ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకోవడమే కాకుండా 18 సంవత్సరాల పాటు హీరోయిన్ గా టాలీవుడ్ ని ఒక ఊపు ఊపింది. గత కొద్ది కాలంగా బాలీవుడ్ లో బాగా సెటిల్ అయిన బ్యూటీ అక్కడ కూడా వరుస ప్రాజెక్టులతో బాగా బిజీగా ఉంది.

బాలీవుడ్ లో ఒక మూవీ చేసే టైంలో తన కో యాక్టర్ విజయ్ వర్మతో ప్రేమలో పడ్డ తమన్న త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతుంది. ప్రస్తుతం ఆమె తన ప్రియుడితో కలిసి ఒక హాట్ వెబ్ సిరీస్ లో అందరికీ చెమటలు పట్టిస్తుంది. ఇంత క్రేజ్ సంపాదించుకున్న తమన్నా ఒకప్పుడు సినిమాల్లోకి వెళ్తాను అని అంటే ఎద్దేవా చేసిన వాళ్ళు ఉన్నారు అంటే నమ్ముతారా.నిజమండి బాబు తమన్నా ఫస్ట్ లో తనకు హీరోయిన్ కావాలి అని ఉంది అని చెప్పినప్పుడు నీ ఫేస్ కి హీరోయిన్ అవుతావా అని తిట్టిన వారు ఉన్నారట.

తమన్నాను అంత దారుణంగా హార్ట్ చేసింది బయట జనాలు అయితే కాదు.. ఆమె సొంత బంధువులే నీ ఫేస్ కి అంత సీన్ లేదు అని తమన్నా ఫేస్ పైన చెప్పారట.సినిమాల్లోకి వెళ్ళాలి అంటే దానికి ఒక స్టేటస్ ఉండాలి.. నీ ఫేస్ చూసి నీకు హీరోయిన్ ఎవరు ఇస్తారు…పిచ్చి పిచ్చి కలలు కనకు…. అని ఎంతో చీప్ గా మాట్లాడడమే కాకుండా.. తమన్నాకు అస్సలు సపోర్ట్ ఇవ్వడానికి ఇష్టపడలేదట.

అయితే వాళ్ల మాటలతో ఎంతో మనస్థాపానికి గురి చెందిన తమన్నా (Tamannaah) తనను తాను ప్రూవ్ చేసుకోవాలి అనే తపనతో ఇండస్ట్రీలోకి ప్రవేశించి ప్రస్తుతం స్టార్ హీరోయిన్ స్టేటస్ ని ఆనందిస్తుంది. తమాషా ఏమిటంటే ఒకప్పుడు ఎవరైతే నువ్వు హీరోయిన్ గానే కాదు అసలు సైడ్ ఆక్టర్ గా కూడా పనికిరావు అని దారుణంగా మాట్లాడారో… ఇప్పుడు వాళ్లే తమన్నా మాకు బంధువు అవుతుంది అని గొప్పలు చెప్పుకుంటూ తిరుగుతున్నారు.

ఆ హీరోల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్
తమ్ముడి కూతురి పెళ్ళిలో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus