Tamannaah: డైమండ్ రింగ్ వార్తలపై స్పందించిన తమన్నా!

టాలీవుడ్ మిల్క్ బ్యూటీ తమన్న ప్రస్తుతం వరుస సినిమాలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. తాజాగా ఈమె నటించిన వెబ్ సిరీస్ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నాయి. అయితే ఈ వెబ్ సిరీస్ షూటింగ్ సమయంలోనే ఈమె నటుడు విజయ్ వర్మతో ప్రేమలో పడ్డారు. ఈ ప్రేమ వ్యవహారం కారణంగా తమన్న ఈ మధ్యకాలంలో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇకపోతే గత రెండు రోజులుగా తమన్నా డైమండ్ రింగు గురించి ఓ వార్త సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.

తమన్నా చేతికి ఉన్నటువంటి ఈ డైమండ్ రింగ్ ఉపాసన తనకు కానుకగా ఇచ్చారని తెలిపారు. అదే విధంగా ఈ డైమండ్ రింగ్ దాదాపు రెండు కోట్ల విలువ చేస్తుందని ఇది ప్రపంచంలోనే ఐదవ అత్యంత పెద్ద డైమండ్ అంటూ ఈ ఉంగరం గురించి ఎన్నో వార్తలు వచ్చాయి. ఈ విధంగా తమన్న చేతికి ఉన్నటువంటి డైమండ్ రింగు గురించి ఇలాంటి వార్తలు వస్తున్నటువంటి తరుణంలో ఉపాసన తమన్నకు ఇలాంటి కాస్ట్లీ గిఫ్ట్ ఇవ్వడం ఏంటి అంటూ కూడా అందరూ ఆశ్చర్యపోయారు

అయితే ఈ వార్తలు చివరికి తమన్న (Tamannaah) వరకు చేరడంతో ఈ వార్తలపై తమన్న స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ తనకు ఉపాసన ఉంగరం ఇచ్చారంటూ వస్తున్నటువంటి వార్తలలో నిజం లేదని తెలిపారు. ఉపాసన ఉంగరం కానుకగా ఇచ్చారంటూ వస్తున్నటువంటి వార్తలన్నీ కూడా పూర్తిగా ఆ వాస్తవమని తెలిపారు.

అంతేకాకుండా తన చేతికి ఉన్నటువంటి రింగ్ అసలు డైమండ్ కాదని ఈమె తెలిపారు.తన వేలికి సోడా బాటిల్ ఓపెనర్ పెట్టుకున్నానని అది తనకు నచ్చడంతో ఫోటోలు తీసుకున్నానని ఈ సందర్భంగా డైమండ్ రింగు గురించి తమన్న క్లారిటీ ఇస్తూ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఆ హీరోల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్
తమ్ముడి కూతురి పెళ్ళిలో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus