మరో బాలీవుడ్ ఆఫర్ దక్కించుకొన్న తమన్నా!
- December 13, 2017 / 03:36 PM ISTByFilmy Focus
“బాహుబలి”తో సూపర్ స్టార్ డమ్ సంపాదించుకొన్నప్పటికీ.. “బాహుబలి 2″లో కేవలం రెండు నిమిషాల సన్నివేశాలకి పరిమితం అయిపోవడంతో అప్పటివరకూ వచ్చిన క్రేజ్ మొత్తం నీరుగారిపోయింది. అలాగే ఆఫర్లు కూడా తగ్గాయి. ప్రస్తుతం తమన్నాకి తెలుగులో స్టార్ హీరోల సరసన అవకాశాలు రావడం లేదు. దాంతో తమిళంలో యువ హీరోల సరసన నటిస్తూ కెరీర్ ను నెట్టుకొస్తోంది. బాలీవుడ్ లో ఆఫర్లు వస్తున్నా సరైనవి కాకపోవడంతో యాక్సెప్ట్ చేయలేక వదులుకోలేక ఇబ్బందులు పడుతోంది, ప్రస్తుతం తెలుగులో “క్వీన్” మరియు కళ్యాణ్ రామ్ సరసన ఒక సినిమాలో నటిస్తున్న తమన్నాకి మరో బాలీవుడ్ ఆఫర్ వచ్చింది.
ఆల్రెడీ “చిక్కడు దొరకడు” హిందీ రీమేక్ లో హీరోయిన్ గా నటించే అవకాశం సొంతం చేసుకొన్న తమన్నాను చూసి బాలీవుడ్ కండల వీరుడు జాన్ అబ్రహాం కూడా ముచ్చటపడినట్లున్నాడు.
అందుకే దర్శకుడు మిలాప్ జవేరీని ఒప్పించి మరీ తమన్నాను హీరోయిన్ గా ఎంపిక చేశాడట. ఈ చిత్రంలో తమన్నా జాన్ అబ్రహాంతో కలిసి యాక్షన్ సీక్వెన్స్ లలోనూ దుమ్ము రేపనుందట. ఇప్పటికే మూడుసార్లు బాలీవుడ్ లో హీరోయిన్ గా ఫెయిల్ అయిన తమన్నా ఈమారు ఎలాగైనా తన మార్క్ వేయాలని అందాల ప్రదర్శనలో మాత్రమే కాక మిగతా విభాగాల్లోనూ గట్టిగా ట్రై చేస్తోంది.












