బాలయ్య సినిమాలో స్పెషల్ సాంగ్ లో చిందులు వేయనున్న తమన్నా?

మిల్క్ బ్యూటీ తమన్న ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా ఒక వైపు సినిమాలలోను వెబ్ సిరీస్లలోను నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి తమన్న గురించి తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తమన్నా అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా రాబోతున్న సినిమాలు స్పెషల్ సాంగ్లో నటించబోతున్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులు జరుపుకుంటుంది.

ప్రస్తుతం ఈ సినిమా NBK 108 వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇక ఈ సినిమాలో తమన్నా స్పెషల్ సాంగ్లో నటించబోతుందంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తల స్పందించి క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్న ఈ వార్తలు గురించి స్పందించారు. ఈ సందర్భంగా తమన్నా స్పందిస్తూ అనిల్ రావిపూడి బాలకృష్ణ గారి సినిమాలలో నటించడం తాను ఎప్పుడు ఆనందంగానే భావిస్తానని తెలియజేశారు.

నాకు వారిద్దరి పట్ల ఎంతో గౌరవం ఉంది.కాంబినేషన్లో రాబోతున్న సినిమాలో నేను స్పెషల్ సాంగ్ లు చేయబోతున్నానంటే వార్తలు వస్తున్నాయి. ఇలా ఏ ఆధారం లేకుండా ఇలాంటి వార్తలను సృష్టిస్తూ వైరల్ చేస్తున్నారు. అయితే ఈ వార్తలు చదివినప్పుడు చాలా బాధ కలిగిందని ఈమె తెలియ చేశారు. ఒక సెలబ్రిటీ గురించి ఇలాంటి వార్తలు రాసే ముందు పూర్తిగా వాటి గురించి క్లారిటీ తెలుసుకున్న తర్వాత రాయండి అంటూ ఈమె తెలియజేశారు.

అయితే తమన్న ఇదివరకు పలు సినిమాలలో స్పెషల్ సాంగ్స్ లో నటించిన విషయం మనకు తెలిసిందే. ఇక ప్రస్తుతం ఈమె బాలీవుడ్ వెబ్ సిరీస్ లతోపాటు తెలుగులో చిరంజీవి హీరోగా నటిస్తున్న భోళా శంకర్ సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నారు.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus