Tamannaah: దివ్య భారతికి ఏమైంది… ఇప్పటికైనా ఆ విషయం తేలుతుందా?

దివ్య భారతి ఎలా చనిపోయింది? ఇప్పటివాళ్లకు ఆమె చనిపోయింది అని తెలుసు కానీ.. ఆమె ఎలా చనిపోయింది అనే విషయం మాత్రం తెలియకపోవచ్చు. అయితే నిన్నటి తరం ప్రేక్షకులు, సినీ అభిమానులకు మాత్రం చాలా రకాల అనుమానాలు ఉన్నాయి. తెలుగులో ఓ ఊపు ఊపేస్తున్న సమయంలోనే బాలీవుడ్‌ వెళ్లి అక్కడ కూడా స్టార్‌ హీరోయిన్‌ అనిపించకుంది దివ్య భారతి. అయితే అనూహ్య పరిస్థితుల్లో ఆమె చనిపోయింది. దీని మీద చాలా రకాల వాదనలు ఉన్నాయి.

ఇప్పుడు ఇదంతా ఎందుకు, ఆమె (Tamannaah) గురించి ప్రస్తావన ఎందుకు అనుకుంటున్నారా? ఎందుకంటే ఆమె జీవితం ఆధారంగా ఓ సినిమా తెరకెక్కబోతోంది. మలయాళంలో దివ్య భారతి జీవితం ఆధారంగా ఓ మూవీని తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. దాని కోసం హీరోయిన్‌గా తమన్నాను సంప్రదించారు అనే టాక్‌ బయటకు వచ్చింది. దీంతో తమన్నా ఆ పాత్రలో ఎలా ఉంటుంది అనే చర్చతోపాటు.. అసలు అప్పుడేమైంది అనే చర్చ కూడా మొదలైంది. 90వ దశకంలో దివ్య భారతి అంటే ఓ ఎమోషన్‌. ఆ రోజుల్లో కుర్రాళ్లకు ఆమె ఆరాధ్య దేవత.

డస్కీ బ్యూటీలు టాలీవుడ్‌ను ఏలుతున్న ఆ సమయంలో మిల్కీ సొగసులతో అలరించింది అని చెప్పాలి. ఇప్పటిలా అప్పుడు పేర్లు పెట్టే పరిస్థితి లేదు కానీ.. ఉండుంటే మిల్కీ బ్యూటీ అనే పేరు పెట్టేసేవారు. ఇప్పుడు ఆ మిల్కీ అందం పాత్రలో మన మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తోంది అని చెబుతున్నారు. 1993లో ముంబయిలోని తన సొంత అపార్ట్ మెంట్ పైఅంతస్థు నుండి పడిపోయి ప్రాణాలు కోల్పోయింది అనేది ఓ వాదన.

అయితే ఈ కేసులో చాలా ఆరోపణు ఎదుర్కొన్న సాజిద్ నడియాడ్ వాలా ప్రమేయం ఈ కేసులో నిర్ధరణ కాలేదు. ప్రమాదవశాత్తు జరిగిన ఘటనగానే దివ్య భారతి మరణం పుస్తకాల్లో ఉండిపోయింది. ఇప్పుడు ఈ సంఘటన ఆధారంగా మలయాళంలో దిలీప్ హీరోగా ‘బాంద్రా’ అనే సినిమా రూపొందుతోందని టాక్. ఆ సినిమాలో దివ్య భారతిగా తమన్నా నటించొచ్చు అని సమాచారం. ఈ క్రమంలో బాలీవుడ్‌లోని చీకటి కోణాలను కూడా చూపిస్తారని టాక్‌.

మంది పార్టిసిపెంట్స్ తో దుమ్ము లేచిపోయిన బిగ్ బాస్ సీజన్ 7 స్టేజ్..!

సీజన్ – 7 లో 5 బ్లండర్ మిస్టేక్స్ ఇవే..!
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 20 సినిమాలు/సిరీస్ ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus