Babli Bouncer: మిల్కీ బ్యూటీ సినిమాకి మిక్స్డ్ రెస్పాన్స్!

టాలీవుడ్ లో దాదాపు అగ్ర హీరోలందరి సరసన నటించింది తమన్నా. స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న మిల్కీ బ్యూటీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దశాబ్దకాలం దాటిపోయింది. అయినప్పటికీ ఆమెకి అవకాశాలు వస్తూనే ఉన్నాయి. సీనియర్ హీరోల సరసన నటిస్తుండడంతో పాటు కొన్ని వెబ్ సిరీస్ లకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రీసెంట్ గా ఈమె నటించిన ‘బబ్లీ బౌన్సర్’ అనే సినిమా ఓటీటీలో విడుదలైంది. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు మధుర్ బండార్కర్ ఈ సినిమాను డైరెక్ట్ చేశారు.

దీంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. పైగా ట్రైలర్ ప్రామిసింగ్ గా అనిపించడంతో.. సినిమాపై ఆసక్తి నెలకొంది. ఒరిజినల్ హిందీ వెర్షన్ అయినప్పటికీ.. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ డబ్బింగ్ చేసి అందుబాటులో ఉంచారు. ఓ చిన్న ఊళ్లో ఉండే బబ్లీ తన్వర్(తమన్నా) తల్లిదండ్రుల మాట జవదాటదు. వాళ్లు తీసుకొచ్చిన సంబంధమే చేసుకోవాలనుకుంటుంది. కానీ విరాజ్ అనే అబ్బాయిని చూసి ప్రేమలో పడుతుంది. అతడికి ఇండిపెండెంట్ గా ఉండే అమ్మాయిలంటే ఇష్టమని తెలుసుకొని జాబ్ చేయడానికి రెడీ అవుతుంది.

దీనికోసం ట్రైనింగ్ తీసుకొని ఢిల్లీకి వెళ్లి ఓ పబ్ లో బౌన్సర్ గా చేరుతుంది. ఆ తరువాత ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయనేదే సినిమా కథ. చాందిని బార్, ఫ్యాషన్, కార్పొరేట్, ట్రాఫిక్ సిగ్నల్ లాంటి విలక్షణ చిత్రాలతో జాతీయ అవార్డులు తీసిన మధుర్ భండార్కర్ నుంచి వచ్చి సినిమా ఇది. దీంతో అంచనాలు ఓ రేంజ్ లో ఏర్పడ్డాయి. కానీ ఈ సినిమా బిలో ఏవరేజ్ గా నిలిచింది.

ఇలాంటి కథను కొత్త దర్శకులు కూడా తీయగలరు. చాలా సాదా సీదాగా అనిపించే సన్నివేశాలు.. ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టే ల్యాగ్.. తమన్నా పెర్ఫార్మన్స్ ను సైతం వీక్ గా మార్చేశాయి. ఇలాంటి సినిమాలను థియేటర్లో భరించడం కష్టమని ఓటీటీకి ఇచ్చారనే మాటలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఈ సినిమా తమన్నాను పెద్ద దెబ్బ కొట్టిందనే చెప్పాలి.

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus