కోలీవుడ్ క్రిటిక్ ప్రశాంత్ రంగస్వామికి ట్విట్టర్ లో దాదాపు ఆరున్నర లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నాయి. యూట్యూబ్ లో కూడా అతడి ఛానెల్ కి చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు. రీసెంట్ గా ప్రశాంత్ రంగస్వామి ఒక ట్వీట్ వేశారు. ‘తెలుగు సినిమాలు తమిళంలో ఎంత బాగా ఆడినా.. ఎన్ని కలెక్షన్స్ సాధించినా.. మాకు అభ్యంతరం లేదు. కానీ తమిళ సినిమాలను తెలుగు ప్రేక్షకులు కించపరిస్తే మాత్రం ఊరుకునేది లేదు. గట్టిగా బదులిస్తాం’ అంటూ రాసుకొచ్చారు.
ఇదంతా ‘పొన్నియిన్ సెల్వన్’ సినిమా గురించే అని తెలుస్తోంది. ఆ సినిమా గురించి మనవాళ్లు తక్కువ చేసి మాట్లాడుతున్నారట. నెగెటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారట. ‘బాహుబలి’ సినిమాతో పోలుస్తూ.. దారుణమైన కామెంట్స్ చేస్తున్నారట. ప్రశాంత్ రంగస్వామితో పాటు చాలా మంది తమిళ క్రిటిక్స్ ఆరోపణలు ఇవి. ఈ విషయంలో తెలుగు ప్రేక్షకులను కించపరిచేలా కొన్ని పోస్ట్ లు కూడా పెడుతున్నారు. ఇవి చూసిన తెలుగు ఆడియన్స్.. వారి కామెంట్స్ కి ధీటుగా బదులిస్తున్నారు.
భాషతో సంబంధం లేకుండా సినిమా నచ్చితే ఆదరించే లక్షణం తెలుగువారికి ఉందని.. కోలీవుడ్ లో హిట్ అవ్వని కొన్ని సినిమాలను తెలుగులో సూపర్ హిట్ చేశామని కామెంట్స్ చేస్తున్నారు మన ఆడియన్స్. మొదటినుంచి కూడా తమిళ హీరోలను, దర్శకులను మన ప్రేక్షకులు ఎంతగా ఆదరిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
చాలా మంది తమిళ హీరోలు, దర్శకులు టాలీవుడ్ లో స్టార్ స్టేటస్ అందుకున్నారు. ఇప్పుడు తెలుగులో స్ట్రెయిట్ సినిమాలు కూడా చేస్తున్నారు. తమిళ హీరోలు కూడా తెలుగు ఆడియన్స్ గురించి గొప్పగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి తెలుగు ఆడియన్స్ మీద నిందలు వేయడం కరెక్ట్ కాదు.