మహేష్ మూవీకి మరో హీరోని యాడ్ చేసిన మురుగదాస్

  • December 12, 2016 / 10:47 AM IST

కమర్షియల్ డైరక్టర్ ఏ.ఆర్. మురుగదాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సినిమాపై రోజు రోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి. క్రేజీ కాంబినేషన్ తో మొదలైన ఈ మూవీలో తమిళ హీరో, డైరక్టర్ ఎస్.జె.సూర్య విలన్ గా నటిస్తున్నాడనే వెలువడగానే అందరి దృష్టి ఈ చిత్రం పై పడింది. ఇప్పుడు మరో తమిళ హీరో ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారనే విషయం బయటికి వచ్చింది. బాయ్స్, ప్రేమిస్తే సినిమాల ద్వారా తెలుగువారికి దగ్గరైన భరత్ సూపర్ స్టార్ సినిమాలో నటిస్తున్నారని నేడు తెలియగానే ఈ చిత్రం పై ఆసక్తి మరింత పెరిగింది.

తమిళం, తెలుగు భాషల్లో ఏకకాలంలో నిర్మితమవుతున్న ఈ ఫిల్మ్ షూటింగ్ ప్రస్తుతం అహ్మదాబాద్ లో జరుగుతోంది. అక్కడే ఈ నెల 27 వరకు కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఫిట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ నటిస్తున్న ఈ మూవీలో సూపర్ స్టార్ ఇన్వెస్ట్ గేట్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. హాట్ యాంకర్ రష్మీ గెస్ట్ రోల్ తో ఆశ్చర్యపర్చనుంది. ఇలా అడుగడునా స్టార్స్ తో నింపి మహేష్ చిత్రానికి గ్రాండ్ లుక్ తీసుకొస్తున్నారు.  ఎన్.వి.ప్రసాద్, ఠాగూర్ మధు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీకి సంభవామి అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. జనవరి ఫస్ట్ న ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus