Tammareddy: టాలీవుడ్‌ 2023పై తన విశ్లేషణ చెప్పిన ప్రముఖ నిర్మాత… ఏమన్నారంటే?

కాస్త కటువుగా చెబుతారేమో కానీ… ఇండస్ట్రీ గురించి పక్కాగా చెప్పేవాళ్లలో దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఒకరు. సినిమాలు ఏంటి, సినిమా ట్రెండ్‌లు ఏంటి, నటీనటుల పరిస్థితి ఏంటి అంటూ ఆయన తరచుగా విశ్లేషిస్తుంటారు. అలా ఇటీవల 2023లో టాలీవుడ్‌ సినిమా పరిస్థితి, ఎందుకలా అయ్యింది లాంటి వివరాల గురించి మాట్లాడారు. ఆ వీడియోలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 2023లో తెలుగు సినిమా గురించి చాలా రకాల వ్యాఖ్యానాలు వస్తున్నా..

తమ్మారెడ్డి (Tammareddy) మాత్రం ఈ ఏడాది హిట్ కొట్టినట్టే అని అన్నారు. గతేడాది వచ్చిన చాలా సినిమాలు సక్సెస్ అయ్యాయి అని లెక్కేఅఆరు. భారీ బడ్జెట్ సినిమాలు, పెద్ద హీరోలు సినిమాలు కొన్ని అంచనాలను అందుకోలేకపోయాయని చెప్పిన ఆయన… టాలీవుడ్‌లో సక్సెస్ రేట్ ఎక్కువగానే ఉందని లెక్క కట్టారు. ఈ క్రమంలో ఓ డిజాస్టర్‌ను ఫెయిల్యూర్‌ కాదు అని కామెంట్‌ చేశారు. గతేడాది వచ్చిన సినిమాల్లో మిమ్మల్ని డిజప్పాయింట్‌ చేసిన సినిమా ఏది అని ఏ తెలుగు సినిమా అభిమానిని అడిగినా ఠక్కున చెప్పే పేరు ‘ఆదిపురుష్‌’.

ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ సినిమా ట్రైలర్‌తో తుస్‌మనిపించింది. ఇక సినిమా వచ్చాక ఆ నరకం గురించి చెప్పాలా? అయితే ఆ సినిమా రూ. 400 కోట్లకుపైగ వసూలు చేయడంతో ఫెయిల్యూర్‌ అనలేం అని తమ్మారెడ్డి అన్నారు. అయితే అది కాస్ట్‌ ఫెయిల్యూర్‌ మాత్రమే అని విశ్లేషించారాయన. అలాగే చిరంజీవి ‘భోళాశంకర్’, రవితేజ ‘రావణాసుర’ కూడా ఆశించిన మేర అంచనాలను అందుకోలేదని చెప్పారు. గుణశేఖర్ – సమంత ‘శాకుంతలం’ మీద అంచనాలే లేవని, అందుకే ఆ సినిమా డిజాస్టర్‌గా చెప్పొచ్చన్నారు.

రామ్‌ – బోయపాటి శ్రీను ‘స్కంధ’ కాస్ట్ ఫెయిల్యూర్‌ అని క్లారిటీ ఇచ్చేశారు. ఆ సినిమాకు అంత బడ్జెట్‌ అవసరం లేదని చెప్పారు. పెద్ద కాస్టింగ్ లేకపోయినా, బడ్జెట్‌ లేకపోయినా విజయం పక్కా అనడానికి ‘బేబీ’ ఒక ఉదాహరణగా చెప్పుకొచ్చారాయన. ఆఖరిగా… ఓటీటీల, టీవీల హక్కుల కోసం కొన్ని సినిమాల్లో విషయం లేకపోయినా పాన్‌ ఇండియా రిలీజ్‌ అంటూ హంగామా చేస్తున్నారని ఆయన ఇండస్ట్రీ పరిస్థితి గురించి చెప్పారు.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus