Tanikella Bharani: ఓటీటీలపై సీనియర్‌ యాక్టర్‌ షాకింగ్‌ కామెంట్స్‌… ఏమన్నారంటే?

ఓటీటీల వల్ల సినిమాలకు ఇబ్బంది అనే మాట చాలా రోజుల నుండి వింటూనే ఉన్నాం. వాటి వల్ల థియేటర్లకు జనాలు రావడం తగ్గిపోతుంది అని కూడా అన్నారు. ఆ మాటకొస్తే టీవీలు వచ్చినపపుడు, టీవీ ఛానల్స్‌ వచ్చినప్పుడు కూడా ఇదే మాట అన్నారు. ఆ తర్వాత ఆ మాట నిలవలేదు అనుకోండి. అయితే ఇదంతా ప్రేక్షకుడు, నిర్మాత వైపు నుండి. కానీ ఓ రచయిత, దర్శకుడి వైపు నుండి ఆలోచిస్తే ఓటీటీలు చాలా ఇబ్బందిపెడుతున్నాయని అన్నారు ప్రముఖ రచయిత, దర్శకుడు, నటులు తనికెళ్ల భరణి.

ఇటీవల ఆయన ఓటీటీల ప్రభావం మీద కొన్ని కామెంట్స్‌ చేశారు. నిజానికి ఓటీటీలు వచ్చాక పరిశ్రమలో నటీనటులు, టెక్నీషియన్లకు అవకాశాలు పెరిగాయి అని చెప్పాయి. సినిమాల్లో అవకాశాలు తగ్గిన వాళ్లు, అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వాళ్లకు ఓటీటీలు ప్రత్యామ్నాయంగా మారాయి. అలాంటి వాళ్లకు ఓటీటీ వల్ల చేతి నిండా పని దొరుకుతోంది. కానీ తన లాంటి వాళ్లకు ఓటీటీలు తలుపులు మూసేశాయని తనికెళ్ల భరణి (Tanikella Bharani) ఆవేదన వ్యక్తం చేశారు. ఎందుకు అనే కారణం కూడా చెప్పారు.

ఓటీటీల్లో ఇటీవల కాలంలో బోల్డ్ కంటెంట్ పెరిగిపోయింది. దీంతో ఆర్ట్ సినిమాలను పట్టించుకునేవారే కరవయ్యారు అని తనికెళ్ల భరణి అన్నారు. దీంతో నాలోని రచయిత, దర్శకుడు మౌనం వహించే పరిస్థితి వచ్చింది అని చెప్పారు. నేను ‘మిథునం’ సినిమా తీసి పదేళ్లు అవుతోంది. ఆ తర్వాత ఇంకో సినిమా చేయలేదు. నా తరహా కళాత్మక సినిమా తీసే వాళ్లకు నిర్మాతలు దొరికే పరిస్థితి కనిపించడం లేదు. మరోవైపు ఓటీటీలు నాలాంటి వాళ్లకు తలుపులు మూసేశాయి అని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రస్తుతం ఆర్ట్‌ సినిమాలో కూడా హింస, అసభ్యత కనిపించాల్సిందే అని కొంతమంది అంటున్నారు. వాళ్లకు కావాల్సిన కంటెంటే ఇవ్వాలి అని కూడా అంటున్నారు. తాను డబుల్ మీనింగ్ డైలాగులు కూడా రాయకుండా ఇన్నాళ్లూ తప్పించుకుని ఇక్కడిదాకా వచ్చానని చెప్పారు భరణి. ఆర్ట్ సినిమాలు తీసే పరిస్థితులు ఇంక ఎప్పటికీ రావా అనే ఆందోళన వ్యక్తం చేశారు అయన. అయితే ఎప్పటికైనా అలాంటి రోజు వస్తుంది అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus