ఇంటర్వ్యూ : ‘పెదకాపు -1’ గురించి తనికెళ్ళ భరణి చెప్పిన ఆసక్తికర విషయాలు

  • September 17, 2023 / 12:06 PM IST

విరాట్ కర్ణ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన ‘పెదకాపు-1’ మూవీ సెప్టెంబర్ 29న రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. ‘అఖండ’తో బ్లాక్‌బస్టర్‌ను ‘ద్వారకా క్రియేషన్స్‌’ అధినేత మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. రెండు పార్టులుగా రాబోతున్న ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న తనికెళ్ళ భరణి .. ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొని కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చారు. అవి మీ కోసం :

ప్ర) ‘పెదకాపు-1’ లో మీ పాత్ర ఎలా ఉండబోతుంది?

తనికెళ్ళ భరణి : అవును.. ట్రైలర్ నా వాయిస్ తోనే ఉంటుంది కదా.! ఇందులో నా పాత్ర చాలా కీలకంగా ఉంటుంది.

ప్ర) ఇందులో కూడా మీరు హీరోకి తండ్రి పాత్ర చేశారా?

తనికెళ్ళ భరణి : అస్సలు కాదు..! ఈ మధ్య కాలంలో ఎక్కువగా తండ్రి పాత్రలే చేశాను. అవి కొత్తగా ఏమీ ఉండవు. అయితే ‘ప్రేమిస్తే చంపేస్తాను’ అన్నట్టు ఉంటుంది.. లేదు అంటే హీరో, హీరోయిన్ల ప్రేమను ఎంకరేజ్ చేసే విధంగా ఉంటుంది. ఈ రెండు రకాలుగానే ఉంటుంది. అందుకే చాలా సినిమాల్లో వచ్చిన తండ్రి పాత్రలను రిజెక్ట్ చేశాను. ఇందులో మాత్రం నా పాత్ర చాలా కొత్తగా ఉంటుంది.

ప్ర) ఇందులో మీది పాజిటివ్ రోలా.. నెగిటివ్ రోలా?

తనికెళ్ళ భరణి : వంద శాతం పాజిటివ్ రోల్. సమాజంపై విసిగిపోయిన ఓ మేధావి అయిన స్కూల్ టీచర్ పాత్ర. స్కూల్ టీచర్ కి సమాజంపై ఒక అవగాహన ఉంటుంది. నా పాత్ర దర్శకుడి వాయిస్ ని రిప్రజెంట్ చేస్తుంది. ప్రేక్షకుల తరపున ప్రశ్నించే పాత్ర. చాలా అద్భుతమైన పాత్ర ఇది. ఈ మధ్య కాలంలో నేను చేసిన బెస్ట్ రోల్ అనుకోవచ్చు.

ప్ర) దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల గారి గురించి చెప్పండి?

తనికెళ్ళ భరణి : శ్రీకాంత్ అడ్దాలా సినిమా అనగానే ఇప్పటివరకు బాపు, విశ్వనాథ్ గారి మార్క్ కలిగిన దర్శకుడు అనుకుంటారు. కానీ ‘పెదకాపు’లో శ్రీకాంత్ అడ్డాల ట్రాన్స్ ఫర్మేషన్ వేరే విధంగా ఉంటుంది. ఇందులో వైలెన్స్ తీవ్రంగా ఉంటుంది. కథ విన్నప్పుడు తండ్రి పాత్ర కాకుండా విలన్ రోల్ అయినా ఇవ్వవయ్యా బాబు అన్నాను. అప్పుడు విలన్ కాదు అని చెప్పి నాకు ఈ పాత్ర ఇచ్చాడు.

ప్ర) శ్రీకాంత్ గారి డైరెక్షన్లో మీకు ఇది రెండో సినిమానా?

తనికెళ్ళ భరణి : కాదు.. మూడో సినిమా..! ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ తర్వాత ‘బ్రహ్మోత్సవం’ కూడా చేశాను. అది ఉత్సవం లాంటి సినిమా కాబట్టి.. నా పాత్ర ఎక్కడో మూలాన ఉంటుంది.బహుశా.. అందుకు మీరు గుర్తించి ఉండరు. (నవ్వుతూ)

ప్ర) కొత్త హీరోతో చేయడం ఎలా అనిపించింది ?

తనికెళ్ళ భరణి : విరాట్ కర్ణ సినిమా ప్రారంభంలో కొత్త వాడిలా అనిపించాడు కానీ.. రానురాను అతను అనుభవం ఉన్న నటుడిగానే కనిపించాడు. 4 నెలల పాటు అతనితో కలిసి పనిచేశాను.

ప్ర) ‘పెదకాపు -1’ హైలెట్స్ ఏంటి?

తనికెళ్ళ భరణి : ఛోటా కె నాయుడుకి నాతో మంచి అనుబంధం ఉంది. అతను కెమెరామెన్ గా చేసిన ఈ సినిమా విజువల్స్ చాలా కొత్తగా ఉంటాయి. అలాగే మిక్కీ జె మేయర్ మ్యూజిక్ కూడా చాలా బాగుంటుంది.

ప్ర) నిర్మాత గురించి చెప్పండి?

తనికెళ్ళ భరణి : మిర్యాల రవీందర్ రెడ్డి గారు ‘అఖండ’ని ఎంత భారీగా నిర్మించారో.. ఈ ‘పెద కాపు-1’ ని కూడా అంత భారీగా నిర్మించారు

ప్ర) చాలా కాలం తర్వాత రైటర్ గా ‘పొన్నియన్ సెల్వన్ ‘ కి పనిచేశారు?

తనికెళ్ళ భరణి : అది దర్శకులు మణిరత్నం గారు పట్టుబట్టి అడిగితే చేశాను. మొదటి పార్ట్ కి మూడు నెలలు టైం అడిగాను. కానీ కాదు నెలలో ఫినిష్ చేయాలని అన్నారు. అలా ఆ సినిమాని నెలలో ఫినిష్ చేయడం జరిగింది. అలాగే అదే సినిమా జయరాం పాత్రకు డబ్బింగ్ చెప్పడం జరిగింది. అతను కూడా చాలా బాగా నటించాడు. అదొక గొప్ప అనుభవం.

ప్ర) హీరోయిన్ తో మీకు కాంబినేషనల్ సీన్స్ ఉంటాయా?

తనికెళ్ళ భరణి : ఉంటాయి..! సినిమా ప్రారంభం నుండి ఎండ్ వరకు చాలా సీన్స్ ఉంటాయి. నా పాత్ర నిడివి కూడా ఇందులో ఎక్కువగానే ఉంటుంది.

ప్ర) ‘కన్నప్ప’ ప్రాజెక్ట్ కి డైరెక్షన్ ఎందుకు చేయలేదు?

తనికెళ్ళ భరణి : ఇది నన్ను అడగాల్సిన ప్రశ్న కాదు. దయచేసి దాని గురించి వద్దు.

ప్ర) ప్రాజెక్టు ఓపెనింగ్ కి పిలిచారా?

తనికెళ్ళ భరణి : పిలిచారు.. కానీ అవన్నీ ఇప్పుడు వద్దు. ఆ ప్రాజెక్టు బాగానే జరుగుతుంది(నవ్వుతూ)

ప్ర) మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి?

తనికెళ్ళ భరణి : శేఖర్ అనే కొత్త దర్శకుడు చేస్తున్న చిత్రంలో ఓ కీలక పాత్ర చేస్తున్నాను. అలాగే కన్నడలో ప్రభుదేవా, శివన్న కాంబినేషన్లో రూపొందుతున్న మూవీలో కూడా ముఖ్యమైన పాత్ర చేస్తున్నాను.

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Interviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus