తనికెళ్ల భరణి ఎంత మంచి నటుడో, అంతకంటే మంచి రచయిత. ఇప్పటితరానికి ఆయన రచయితగా పెద్దగా తెలియకపోవచ్చు కానీ.. గత తరానికి బాగా తెలుసు. అంతటి గొప్ప సినిమాలు రాశారాయన. అంతటి గొప్ప పెన్ను పవర్ ఉన్న ఆయన ఇటీవల కాలంలో మాటలు రాయడం లేదు. దీంతో ఎక్కడో ఆయన పంచ్‌లు, మాటలు మిస్ అవుతున్న వారికి గుడ్ న్యూస్. చాలా ఏళ్ల తర్వాత ఆయన పెన్ను పట్టుకున్నారు. అది కూడా ‘పొన్నియిన్ సెల్వన్ – 1’ లాంటి పెద్ద సినిమాతో.
అవును, మణిరత్నం తెరకెక్కిస్తున్న ‘పొన్నియిన్ సెల్వన్ – 1’ సినిమా తెలుగు వెర్షన్‌కు తనికెళ్ల భరణి మాటలు రాశారు. ఇటీవల విడుదలైన ఆ సినిమా టీజర్‌లో పెద్దగా తనికెళ్ల భరణి పెన్ను పవర్ కనిపించలేదు కానీ, సినిమాలో మాత్రం ఆయన డైలాగ్‌లు అదిరిపోతాయి అని చెబుతున్నారు. ఆయన ఆఖరిసారిగా కేవలం మాటలు రాసిన సినిమా ‘హ్యాండ్సప్’. ఈ సినిమా 2000 సంవత్సరంలో వచ్చింది. అయితే ఆయన రాసి, దర్శకత్వం వహించిన సినిమా మాత్రం ‘మిథునం’. ఇది 2011లో వచ్చింది.
ఆ లెక్కన ఆయన నుండి రచయితగా సినిమా వచ్చి 22 ఏళ్లు, దర్శకరచయితగా సినిమా వచ్చి 11 ఏళ్లు అయ్యింది. ఇప్పుడు ఇన్నాళ్లకు ఆయన తిరిగి పెన్ను పట్టుకున్నారు. అయితే ఇన్నాళ్లూ ఆయన ఎందుకు రాయలేదు, ఇప్పుడు ఈ సినిమా కోసం ఎందుకు రాస్తున్నారు అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమా టీజర్ సంగతి చూస్తే… ప్రధాన పాత్రధారులు విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్య రాయ్, త్రిష పరిచయానికే కేటాయించారు. దీంతోపాటు కథ కీలక పాయింట్‌ను కూడా చెప్పారు.
‘‘ఈ కల్లు, పాట, రక్తం, పోరాటం అంతా దాన్ని మర్చిపోవడానికే.. ఆమెను మర్చిపోవడానికే.. నన్ను నేను మర్చిపోవడానికి..’ అంటూ విక్రమ్ పలికిన సంభాషణ ఆసక్తికరంగా ఉంది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ‘పొన్నియిన్ సెల్వన్’ రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తొలి భాగం సెప్టెంబరు 30న విడుదల చేయనున్నారు.
Most Recommended Video
టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!