విడుదల సన్నాహాల్లో ఆర్.వి.జి “తప్పించుకోలేరు”

ఆర్.వి.జి మూవీజ్- ఎస్.వి.ఎల్.ఎంట్రప్రైజస్ పతాకాలపై రుద్రాపట్ల వేణుగోపాల్ (ఆర్.వి.జి)-తలారి వినోద్ కుమార్ ముదిరాజ్- శ్రీనివాస్ మామిడాల-లలిత్ కుమార్ సంయుక్తంగా నిర్మించిన సూపర్ సస్పెన్స్ థ్రిల్లర్ “తప్పించుకోలేరు”. “కొత్తకథ, ఉసురు, అయ్యప్ప కటాక్షం” వంటి చిత్రాలతో దర్శకుడిగా తన సత్తాను ఘనంగా చాటుకున్న రుద్రాపట్ల వేణుగోపాల్ (ఆర్.వి.జి) తాజాగా రూపొందించిన ఈ చిత్రం సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆగస్టు ప్రథమార్థంలో విడుదలకు సిద్దమవుతోంది. ఆదర్శ్, హరీష్, ట్వింకిల్ అగర్వాల్, సాయి శ్వేత, ఆకెళ్ల, ఫహీం ముఖ్య తారాగణంగా రూపొందిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మధ్యప్రదేశ్ లోని భోపాల్ గ్యాస్ సంఘటన స్పూర్తితో తెరకెక్కింది. మధ్యప్రదేశ్ పర్యాటక సౌజన్యంతో చాలా భాగం భోపాల్ మరియు పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రాన్ని అక్కడ కూడా విడుదల చేయడానికి దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

దర్శకనిర్మాత ఆర్.వి.జి మాట్లాడుతూ…”మా చిత్ర నిర్మాణంలో మధ్యప్రదేశ్ పర్యాటక శాఖ అందించిన సహాయసహకారాలు మారువలేనివి. అలాగే అక్కడి ప్రజలు, మీడియా చూపించిన ఆదరాభిమానాలు కూడా. ఇప్పటివరకు ఇండియన్ స్క్రీన్ పై వచ్చిన అన్ని సస్పెన్స్ థ్రిల్లర్స్ కంటే డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో రూపొందిన “తప్పించుకోలేరు” చిత్రాన్నిఆగస్టు ఫస్టాఫ్ లో రిలీజ్ చేస్తున్నాం. వి.ఎస్.పి.తెన్నేటిగారి మాటలు-పాటలు, రాజేష్ రాజ్ మ్యూజిక్.. ఈ చిత్రానికి ప్రధానాకర్షణలుగా నిలుస్తాయి” అన్నారు.

ఏ.విఎల్.నరసింహం, నిట్టల మల్లాది భాస్కర్, మేజర్ ఆర్.వి.సుబ్బారావు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి రచనా సహకారం: వి.ఆర్.కంచి, ఛాయాగ్రహణం: ప్రసాద్ కె.నాయుడు, సంగీతం: రాజేష్ రాజ్.టి, మాటలు-పాటలు: వి.ఎస్.పి.తెన్నేటి, నిర్మాతలు: రుద్రాపట్ల వేణుగోపాల్ (ఆర్.వి.జి)-తలారి వినోద్ కుమార్ ముదిరాజ్-శ్రీనివాస్ మామిడాల-లలిత్ కుమార్, రచన-దర్శకత్వం: రుద్రాపట్ల వేణుగోపాల్(ఆర్.వి.జి)!!

Most Recommended Video

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus