Taraka Ratna: ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తారకరత్న.. వైరల్ అవుతున్న ఫోటో..!

నందమూరి తారకరత్న ఇటీవల గుండెపోటుకి గురై.. బెంగుళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఊహించని ఈ సంఘటనతో నారా – నందమూరి కుటుంబాల వారు ఆందోళనకు గురయ్యారు. భవిష్యత్ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనాలని, పార్టీ తరపున ప్రచారం చేయాలని ప్రణాళిక వేసుకుంటున్న సమయంలో ఇలా జరగడం బాధాకరమని నందమూరి అభిమానులు, పార్టీ వర్గాల వారు ఆయన త్వరగా కోలుకోవాలని పూజలు, ప్రార్థనలు చేస్తున్నారు. ప్రస్తుతం చికిత్సకు స్పందిస్తున్నారని, అవయవాల పనితీరు మెరుగుపడిందని సమాచారం.

తాజా హెల్త్ అప్‌డేట్ ప్రకారం.. పరిస్థితి ఇప్పుడు కొంత బెటర్ కానీ ప్రమాదకరంగానే ఉంది అని తెలుస్తోంది. ఇప్పుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తారకరత్న ఫోటో బయటకొచ్చింది. బెడ్ మీద ఉన్న తారక్ పిక్ నెట్టింట వైరల్ అవుతోంది. తారకరత్నను ఇలా చూడడం బాధగా ఉంది.. ఆయన పూర్తి ఆరోగ్యంతో త్వరగా కోలుకుని తిరిగి రావాలి అంటూ ఫ్యాన్స్, పార్టీ వర్గాల వారు సామాజిక మాధ్యమాలలో తారకరత్న హాస్పిటల్ ఫోటోను షేర్ చేస్తున్నారు.

2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus