Taraka Ratna: అక్కడినుంచి తారకరత్న పోటీ చేయనున్నారా?
- January 10, 2023 / 08:28 PM ISTByFilmy Focus
నందమూరి హీరోలలో ఒకరైన తారకరత్న నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్నా సినిమాల్లో ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదనే సంగతి తెలిసిందే. తారకరత్న ఇప్పటికీ పరిమితంగా సినిమాలలో నటిస్తున్నా ఆ సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ ను సొంతం చేసుకోకపోవడం గమనార్హం. అయితే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని తారకరత్న భావిస్తున్నారని సమాచారం అందుతోంది. వచ్చే ఎన్నికల్లో ఏపీ నుంచి టీడీపీ తరపున తారకరత్న పోటీ చేయనున్నారు. అయితే తారకరత్న పోటీ చేసే నియోజకవర్గంకు సంబంధించి స్పష్టత రావాల్సి ఉంది.
తారకరత్న టీడీపీ అనుకూల నియోజకవర్గాల్లోనే పోటీ చేయాలని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. తాజాగా తారకరత్న లోకేశ్ ను కలవడం గమనార్హం. తారకరత్న భవిష్యత్తు ప్రణాళికలకు సంబంధించి పూర్తిస్థాయిలో స్పష్టత రావాల్సి ఉంది. తారకరత్న కొన్ని వారాల క్రితం జూనియర్ ఎన్టీఆర్ కూడా టీడీపీ తరపున ప్రచారం చేస్తారని కామెంట్లు చేయగా ఆ కామెంట్లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. తారకరత్న నందమూరి హీరోల ప్రాజెక్ట్ లలో నటిస్తే ఈ హీరో క్రేజ్ మరింత పెరిగే అవకాశం అయితే ఉంటుందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

తారకరత్న ఈ దిశగా అడుగులు వేయాలని కొంతమంది సూచిస్తున్నారు. కెరీర్ లో తప్పటడుగులు వేయకుండా తారకరత్న జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. తారకరత్న రెమ్యునరేషన్ కూడా తక్కువగానే ఉందని సోషల్ మీడియాలో కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. తారకరత్న రాజకీయాల్లో ఏ స్థాయిలో సక్సెస్ అవుతారో చూడాల్సి ఉంది. త్వరలో ఆయన పొలిటికల్ ప్లాన్స్ కు సంబంధించి మరిన్ని వివరాలు తెలిసే ఛాన్స్ అయితే ఉంది.

తారకరత్న గతంలో కొన్ని వివాదాల ద్వారా వార్తల్లో నిలిచినా ఇప్పుడు మాత్రం వివాదాలకు దూరంగా ఉండటానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. సరైన దారిలో తారకరత్న అడుగులు వేసి మరిన్ని విజయాలను అందుకోవాలని అభిమానులు భావిస్తున్నారు.
8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!
రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!












