SSMB28: మహేష్‌ సినిమాలో తారకరత్న ఉన్నాడా…!

నిప్పు లేనిదే పొగ రాదు అంటారు.. ఛస్‌ ఐస్‌ ముక్క ఉన్నా కూడా వస్తుంది కదా అంటారా? ఇలాంటి ఐస్‌ లాజిక్‌లు పక్కన పెట్టేస్తే.. ఆ పొగ లాంటి చిన్న ట్వీట్‌ ఇప్పుడు టాలీవుడ్‌లో వైరల్‌ అవుతోంది. పనిలో పనిగా సరికొత్త కాంబినేషన్‌ చూసే అవకాశం కల్పిస్తోంది. ఆ దర్శకుడు ట్రాక్‌ రికార్డు చూసుకుంటే అలాంటి కాంబినేషన్‌ను క్రియేట్‌ చేయడం పెద్ద విషయం కూడా కాదు. ఇదంతా #SSMB28 సినిమా గురించే.

మహేష్‌బాబు – త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. చాలా రోజుల క్రితమే ముహూర్తం షాట్‌ కూడా కొట్టేశారు. అయితే ‘సర్కారు వారి పాట’ పనులు, మహేష్‌బాబు ట్రిప్పులతో సినిమా ఆలస్యం అవుతూ వస్తోంది. అయితే జులైలో సినిమా పక్కాగా స్టార్ట్‌ చేస్తారు అని చెబుతున్నారు. దీంతో సినిమా కాస్టింగ్‌ పనులు జోరందుకున్నాయంటున్నారు. ఇప్పటికే చాలావరకు ఓకే అయిపోయాయట. ఇంకొన్ని పెండింగ్‌లో ఉన్నాయట. అలాంటివాటిలో విలన్‌ ఒకటి అట. త్రివిక్రమ్‌ సినిమాల్లో విలన్‌ అంటే హీరోకు సమానమైన పాత్రలానే చూపిస్తారు.

అంత స్టేచర్‌ ఇస్తారు. అలాంటి విలన్‌ ఎవరా అని చూస్తూ ఆ మధ్య కోలీవుడ్‌, శాండిల్‌వుడ్‌ను ఓ చుట్టు చుట్టేశారట అయితే ఆఖరిగా తెలుగులోనే మాజీ హీరోను పట్టుకున్నారని అంటున్నారు. నందమూరి వారసుడు తారకరత్నను విలన్‌గా చూపిస్తారని సమాచారం. ఈ పుకార్లు అలా అలా తిరుగుతున్న సమయంలో తారకరత్న అనే పేరున్న ఓ ట్విటర్‌ అకౌంట్‌లో ఇదే ట్వీట్‌ కనిపించింది. దీంతో ఆ అకౌంట్, ట్వీట్‌ నిజమనుకొని, ఫ్యాన్స్ తెగ సరదాపడిపోయారు. కానీ ఆ అకౌంట్‌ నకిలీది అని తెలసింది.

కానీ ఆ కాంబినేషన్‌కి వచ్చిన హైప్‌ అలానే ఉండిపోయింది. దీంతో ఆ ట్వీట్‌ నిజమవుతుందా. మహేష్‌ సినిమాలో విలన్‌గా తారకరత్నను చూస్తామా అనే చర్చ అయితే కొనసాగిస్తున్నారు. మరి తారకత్న దగ్గరకు ఈ విషయం వెళ్లిందా, వెళ్తే ఆయన ఏం చెప్పారు అనేది తెలియాలి. తారకరత్న హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా సరైన సక్సెస్ అందుకోని మాట వాస్తవమే. కానీ ఉత్తమ విలన్‌గా ‘అమరావతి’ చిత్రానికి నంది అవార్డు అందుకున్న విషయం మరచిపోకూడదు. ‘రాజా చెయ్యి వేస్తే’ సినిమాలో కూడా అతడి నటన ఫర్వాలేదనిపించింది. ఇప్పుడు అదే విలనిజం మహేష్‌ ఎదుట చూపిస్తాడా?

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus